చిన్న సినిమాలను ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీ చాలా బాగుంటుందని, కొత్త టాలెంట్ పుట్టుకొస్తుందని కమెడియన్ అలీ అన్నారు. ‘భారీ తారాగణం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు అలీ (Ali) కజిన్ కొడుకు సదన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భారీ తారాగణం’ (Bhari Taraganam). బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సదన్ తోపాటు దీపికా రెడ్డి, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్ ను ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు యస్. వి. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన దర్శక, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో మా అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తను ఇలాగే మంచి చిత్రాలలో నటించి పెద్ద హీరో అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. ఇందులో నాకు మంచి పాత్ర లభించింది. ఇలాంటి మంచి సినిమాలో నేను భాగం అయినందుకు చాలా హ్యాపీ గా ఉందని అన్నారు. ఈక్రమంలోనే చిన్న సినిమాలకు అంతగా ప్రోత్సాహం లేకపోవడం పట్ల అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్పీచ్ కొనసాగిస్తూనే.. తనకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. పెద్ద సినిమాలు డబ్బింగ్ అవుతాయి.. రీమేక్ లు అవుతాయి. ఇప్పుడు మనం వాటిని పాన్ ఇండియా అంటున్నాం. కానీ చిన్న సినిమాలు ఎంత బాగున్నప్పటికీ వేరే స్టేట్ వాళ్లు ఎందుకు డబ్బింగ్ చేసుకోరనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయినా మన తెలుగు ఆడియెన్స్ గొప్పవారు. కాంతార తదితర చిత్రాలను ఎంత పెద్ద హిట్ చేశారు చూశాం. అలాగే ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలను తెలుగులో డబ్ చేస్తే చూస్తారు.. ఆదిరిస్తారు.. అది తెలుగు వాడి గొప్పతనం. మనది జాలిగుణం.. మిగితా వాళ్లకు ఉందా లేదన్నది తెలియడం లేదు.
చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలను, హీరోలను ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ ఎందుకని చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. చిన్న సినిమాలు హిట్ అయితేనే పది మంది నిర్మాతలు, హీరోలు పుడుతారని చెప్పుకొచ్చారు. పలువురు చిన్న నిర్మాతలు ఇదే విషయమైన తనను సంప్రదించినప్పుడు తనేం చేయాలని పరిస్థితి ఉందంటూ బదులిచ్చానన్నారు. కానీ చిన్నసినిమాల ప్రమోషన్స్ కు, కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చినట్టు తెలిపారు. ఇక ‘భారీ తారాగణం’గా వస్తున్న చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అలాగే గెస్ట్ గా వచ్చిన దర్శకులు యస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి లు మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకున్నారు. సుక్కు మ్యూజిక్ బాగుంది. అలీ తన పాత్రతో ఒదిగిపోతారు. బాబా కొడుకు హీరో గా చేయడం సంతోషం... నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే ప్రతి ఫ్రెమ్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. దర్శక నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు వస్తుందని తెలిపారు.
చిత్ర నిర్మాత బీవీ.రెడ్డి మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ లాంచ్ కు వచ్చిన దర్శకులు యస్. వి. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, గార్లకు ధన్యవాదాలు తెలిపారు. సెకెండ్ కరోనాలో మా సినిమా స్టార్ట్ అయింది. అప్పటి నుండి మేము స్ట్రగుల్ పడుతూ వచ్చాము. చిన్న నిర్మాత అనుకోకుండా ఏ టైంకు పిలిచినా నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమాబాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంన్నారు.
చిత్ర దర్శకులు శేఖర్ ముత్యాల మాట్లాడుతూ… మా టెక్నీకల్ టీమ్ అంతా చాలా టాలెంటెడ్ పర్సన్స్, వర్క్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పని చేశారు. లవ్ కామెడీ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరో సదన్ మాట్లాడుతూ… మా దర్శకులు శేఖర్ అన్నకు ఓపికా చాలా ఎక్కువ, నిర్మాతను మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎప్పుడు కోప్పడకుండా చాలా కూల్ గా ఉన్నారు. ఇక హీరోయిన్స్ కూడా మాట్లాడుతూ.. చిత్ర దర్శకులు మమ్మల్ని నమ్మి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.