హాలీవుడ్ స్టార్‌ హీరో తో జూనియర్ ఎన్టీఆర్‌, వైరల్ అవుతున్న ఫోటో

Published : Mar 12, 2023, 03:50 PM ISTUpdated : Mar 12, 2023, 03:52 PM IST
హాలీవుడ్ స్టార్‌  హీరో తో జూనియర్ ఎన్టీఆర్‌, వైరల్ అవుతున్న ఫోటో

సారాంశం

ఆస్కార్ వేడుకలకుఅంతా సిద్థం అయ్యింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు అమెరికా వెళ్ళిన చరణ్, ఎన్టీఆర్ హాలీవుడ్ దిగ్గజ నటులను కలిసి.. వారితో ఫోటో మెమరీలను పంచుకుుంటున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈక్రమంలో ఎన్టీఆర్.. హాలీవుడ్ స్టార్ హీరోను కలిశారు. 

ఆస్కార్ వేడుకలకు లాస్ ఏంజల్స్ నగరం ముస్తాబయ్యింది. ప్రపంచ దిగ్గజ నటులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. అలాంటి గొప్ప గొప్ప నటులలో మన తెలుగువారు కూడా ఉండటం మనకు గర్వకారణం. ఆస్కార్ బరిలో ఉన్న ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్. చరణ్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్ లాంటి దిగ్గజాలు లాస్ ఏంజల్స్ లో ఎప్పుడో లాండ్ అయ్యారు. ఇక మరికొన్ని గంటల్లో  ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరగబోతుంది. ఈ వేడుకలకు ముందు జరిగే కొన్ని పార్టీలు,ఫంక్షన్స్ కు ఆర్ఆర్ఆర్ టీమ్ అటెండ్ అవుతుంది. ఇక ఈ వేడుకల్లో తారక్ , చరణ్ హాలీవుడ్ దిగ్గజ నటులను కలిసి వారితో దిగిన ఫోటోలను శేర్ చేసుకుంటున్నారు. 

రాంచరణ్‌,తారక్‌ హాలీవుడ్ సెలబ్రిటీలు,టెక్నీషియన్లను కలుసుకుని వాటి ఫ్యాన్స్ తో శేర్ చేస్తుంటే..ఆఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అవి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ మరో హాలీవుడ్ స్టార్ ను కలిశారు. ది మమ్మీ, ది వేల్‌ ఫేం బ్రెండన్‌ ఫ్రేసర్‌ ‌నుకలిశాడు తారక్‌. జార్జ్‌ క్లూనీ, ఏంజెలా బస్సెట్‌, కేట్‌ బ్లాంచెట్‌ హోస్టులుగా వ్యవహరించిన MPTF Night పార్టీ ఈవెంట్‌లో ఇలా ఫ్రేసర్‌తో సందడి చేశాడు తారక్‌. హాలీవుడ్‌ స్టార్‌ తో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్‌ ఎన్టీఆర్ దిగిన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి... నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

 

ఇక ఆస్కార్‌ అవార్డ్స్‌  వేడుక కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇండియా అంతా వెయ్యి కళ్ళతో ఏదురుచూస్తోంది. అంతే కాదు ఆస్కార్ స్టేజ్ పై మనవాళ్ళ పెర్ఫామెన్స్ కూడా ఉంటుంది అని అంటున్నారు. మరి అందులో నిజం ఎంతో తెలియదు కాని ఈ వేడుకలు మాత్ర మన ఇండిమయన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఇక నాటు నాటు సాంగ్ తప్పకుండా ఆస్కార్‌లో విజేతగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు మ్యూజిక్‌ లవర్స్‌.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా