కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుశర్ల సత్యనారాయణ’ డాక్యుమెంటరీ.. డిటేయిల్స్..

By Asianet News  |  First Published Mar 12, 2023, 3:05 PM IST

హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి సుశీల్ రావు తీసిన ‘ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుశర్ల సత్యనారాయణ’ డాక్యుమెంటరీకి ప్రత్యేక గౌరవం దక్కింది. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో  చోటుదక్కించుకుంది. 


హైదరాబాద్ కు చెందిన డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ ‘ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుశర్ల సత్యనారాయణ’ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు సుశీల్ రావు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గతేడాది డిసెంబర్ 15న ప్రివ్యూ థియేటర్‌లో అవార్డుల వేడుకలో డాక్యుమెంటరీని ప్రదర్శించారు.  

తాజాగా ఈ డాక్యుమెంటరీ ఏప్రిల్ 17, 2023న ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలోని కేన్స్‌లో జరగనున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సెమీ-ఫైనలిస్ట్ విభాగంలోకి చేరింది. ఉత్తమ దర్శకుడు – డాక్యుమెంటరీ షార్ట్ కింద ఎంపికైనట్టు తెలిపారు. తెలంగాణలోని సూర్యాపేట పట్టణానికి సమీపంలోని రాఘవపురంలో తన 70 ఎకరాల పూర్వీకుల భూమిలో అడవిని సృష్టించాడు. అక్కడే ‘ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్యనారాయణ’సుమారు 69 ఏళ్ల ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణవేత్తగా దుశర్ల సత్యనారాయణ ఆరు దశాబ్దాల కిందనే అడవిని అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. 

Latest Videos

1908లో హైదరాబాద్‌లో మూసీ నది వరదల సమయంలో 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టుపై చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన ‘ది గ్రేట్ ఇండియన్ టామరిండ్ ట్రీ’ అనే మరో డాక్యుమెంటరీ డిసెంబర్ 2022లో జరిగిన 11వ ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. సుశీల్ రావు రూపొందించిన ‘ఆన్ ట్రైల్ ఆఫ్ ది జెనెటిక్ కోడ్’ అనే డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మకమైన ‘ఫెస్టివల్ డి కేన్స్” కోసం పంపించారు. ఇక 76వ కేన్స్ ఫెస్టివల్ - 2023 మే 16-27, 2023 వరకు జగనుంది. 

గతేడాది India's Green Heart Dusharla Satyanarayana డాక్యుమెంటరీకి  తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దర్శకుడు చిల్కూరి సుశీల్ రావుకు అవార్డును అందిస్తూ ప్రముఖ గీత రచయిత సద్దాల అశోక్ తేజ, టీఐఎఫ్‌ఎఫ్ వ్యవస్థాపకురాలు, చిత్ర దర్శకురాలు మంజుల సూరూజు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ గిరిధర్, ఐపీఎస్, ఆస్ట్రేలియాకు చెందిన టీఐఎఫ్‌ఎఫ్‌కు చెందిన మురళీ ధర్మపురి గతేడాది అభినందించారు.

click me!