రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసినా ప్రకాష్ రాజ్ తో రీసెంట్ గా వకీల్ సాబ్ సినిమా చేసారు. ఇప్పుడు అలాగే తన పాత మిత్రుడు అలీతో కూడా ఓ సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది.
సినిమాలు వేరు..రాజకీయాలు వేరు..స్నేహాలు వేరు. ఈ మూడు ఒకదానికొకటి కలిపేసి కలగాపులగం చేస్తేనే సమస్య వస్తుంది. మన మన దేశంలో చాలా మంది అదే చేస్తూంటారు. ఓ ఆర్టిస్ట్ వ్యక్తితంగా ఫలానా రాజకీయనాయుకుడు సిద్దాంతాలు నచ్చాయి అని ఆయన కు మధ్దతు ఇస్తే ఆ పొలిటీషన్ ని ఇష్టపడిని వాళ్లు ఆ ఆర్టిస్ట్ పై బ్యాన్ పెడతారు. అతనికి వేషాలు ఇవ్వరు. జనసేన అథినేత పవన్ సినిమాల్లో నటించాలంటే ఆయన పార్టిని సపోర్ట్ చేయాలా..అలాంటివేమీ అక్కర్లేదు. సినిమా వేరు, రాజకీయాలు వేరు అనే స్దాయి మెచ్యూరిటి పవన్ కళ్యాణ్ కు ఉంది. అందుకే తనపై రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసినా ప్రకాష్ రాజ్ తో రీసెంట్ గా వకీల్ సాబ్ సినిమా చేసారు. ఇప్పుడు అలాగే తన పాత మిత్రుడు అలీతో కూడా ఓ సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది.
మొదటి నుంచి పవన్ కల్యాణ్ తో 'అలీ'కి మంచి స్నేహం ఉంది. అది ఏ స్దాయి అంటే పవన్ కల్యాణ్ సినిమాల్లో అలీ తప్పకుండా ఉండవలసిందే. వాళ్ల సాన్నిహిత్యం గురించి తెలిసిన సినీ రైటర్స్, డైరక్టర్స్.. దర్శకులు అలీ కోసం ఒక క్యారక్టర్ ను తప్పకుండా క్రియేట్ చేసేవారు. అలా పవన్ సినిమాల్లో దాదాపుగా అలీ కనిపిస్తూ వచ్చాడు.
అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లాక వీళ్ల కాంబినేషన్ లో సినిమాలు కరువు అయ్యాయి. అలీ వేరే పార్టీలోకి వెళ్లడం .. ఆ సందర్భంలో ఒకరిపై ఒకరు మాటల బాణాలు సంధించుకోవడం జరిగింది. అలా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. ఈ గ్యాప్ లో మొన్నటి దాకా పవన్ సినిమాలు చెయ్యలేదు కనుక..అలీ ఆయనతో చేయేలేదు. వకీల్ సాబ్ తర్వాత..పవన్ హీరోగా వరుసగా భారీ సినిమాలు రూపొందుతున్నాయి. క్రిష్ .. సాగర్ .కె చంద్ర .. సినిమాలు సెట్స్ పై ఉండగా, హరీశ్ శంకర్ .. సురేందర్ రెడ్డి .. త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ పవన్ తో కలిసి అలీ నటించే అవకాశం ఉందని అంటున్నారు.
దానికి ఊతం ఇచ్చింది...రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ, అవకాశం వస్తే పవన్ తో కలిసి నటించడానికి తాను సిద్ధమని అన్నాడు. తనతో రాజకీయ పరమైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ తాజాగా ప్రకాశ్ రాజ్ తో కలిసి నటించిన పవన్, అలీ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని చెప్పుకుంటున్నారు. అలీ ముందుకు వస్తే ఖచ్చితంగా పవన్ కూడా ఓకే అంటారు.ఇద్దరూ త్వరలోనే ఓ సినిమాలో కనిపిస్తారు..ఏమంటారు?!