ఏంటీ దారుణం: శుక్రవారం రిలీజ్...మరీ 500 టిక్కెట్లే తెగాయా?

Published : Jul 10, 2024, 05:06 PM IST
  ఏంటీ దారుణం: శుక్రవారం రిలీజ్...మరీ 500 టిక్కెట్లే తెగాయా?

సారాంశం

  'ఆకాశం నీ హ‌ద్దురా'  చిత్రాన్ని 'సర్ఫిరా' అనే టైటిల్ తో హిందీలో రీమేక్ చేసారు. 


అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్ కు ఇది ఓ రకంగా అవమానమే. అయితే అది ఎవరూ ఆయనకి చేసింది కాదు. ఆయన స్వయం కృతాపరాధమే. లేకపోతే ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఓ రేంజిలో బజ్ వినిపించేది. భాక్సాఫీస్ దగ్గర మంచి హంగామా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అన్నా కేవలం 500 టిక్కెట్లు మాత్రమే తెగటం మాత్రం షాకే. ఇది ఎవరూ ఊహించలేరు.  నేషనల్ మల్టీప్లెక్స్ ల వద్ద కేవలం 500 టిక్కెట్లు మాత్రమే తెగాయంటూ బాలీవుడ్ భాక్సాఫీస్ ట్రాకర్ ట్వీట్ చేయటంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. 

చిత్రం విషయానికి వస్తే ఇదో తమిళ సూపర్ హిట్ చిత్రం రీమేక్.   తమిళ హీరో సూర్య, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సూరరై పొట్రు'. డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 2020 లో కోవిడ్ పాండమిక్ కారణంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ చేశారు. ఇది 'ఆకాశం నీ హ‌ద్దురా' పేరుతో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని 'సర్ఫిరా' అనే టైటిల్ తో హిందీలో రీమేక్ చేసారు. సుధా కొంగ‌ర డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్  హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇప్పుడు మరో ట్విస్ట్ ఏమిటంటే...ఈ సినిమాకు  పోటీగా అదే రోజున హిందీ డబ్బింగ్ వెర్షన్ వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం రోజున ఒరిజినల్ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. 'సూరరై పొట్రు' హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థ.. 'ఉడాన్' అనే పేరుతో ఈ శుక్రవారం ఉదయం గం. 11:40 నిమిషాలకు టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ప్రోమో వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

ఇక రూపాయికే ఎయిర్ లైన్ టికెట్ అందించాలన్న కలలు కనే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథతో వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ సూరారై పొట్రు. సూర్య ఈ సినిమాలో నటించాడు. ఇప్పుడిదే మూవీ హిందీలో సర్ఫిరాగా రీమేక్ అయింది. మామూలు వ్యక్తులు కూడా విమానం ఎక్కాలని కలలు కనే ఆ వ్యక్తి.. తన జీవితంలో అనుకున్నది సాధించాడా లేదా అన్నది ఈ సినిమా.
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..