Akshay Kumar New House : కొత్త ఇల్లు కొన్న అక్షయ్ కుమార్.. ఎన్ని కోట్లు పెట్టాడో తెలుసా..?

By Mahesh Jujjuri  |  First Published Jan 23, 2022, 4:55 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) మరో సారి ఓ ఇంటివాడు అయ్యాడు. ముంబయ్ లోని కాస్ట్లీ ఏరియాలో .. కాస్ట్లీ హౌస్ ను కొన్నాడు అక్షయ్ కుమార్.  దీని కోసం ఆయన చాలా కోట్లు ఖర్చు  పెట్టినట్టు తెలుస్తోంది.


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) మరో సారి ఓ ఇంటివాడు అయ్యాడు. ముంబయ్ లోని కాస్ట్లీ ఏరియాలో .. కాస్ట్లీ హౌస్ ను కొన్నాడు అక్షయ్ కుమార్.  దీని కోసం ఆయన చాలా కోట్లు ఖర్చు  పెట్టినట్టు తెలుస్తోంది.

 

Latest Videos

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ముంబైలో ఓ కాస్ట్లీ ఇల్లు కొన్నట్టు తెలుస్తోంది. ముంబయ్ లోని ఖార్ వెస్ట్ లోని జాయ్ లెజెంట్ భవనంలో 19వ ప్లోర్ లో ఉన్న అపార్ట్ మెంట్ ను అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ అపార్ట్ మెంట్ 1878 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అపార్ట్ మెంట్ కోసం అక్షయ్ కుమార్ ఏకంగా 7 కోట్ల 80 లక్షల వరకూ ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.

అక్షయ్ కుమార్(Akshay Kumar)  ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబయ్ లోని అత్యంత  ఖరీదైన ప్రాంతం జూహూలో ఓ డూప్లెక్స్ బిల్డింగ్ లో ఉంటున్నారు. ఆయనకు గతంలో అంధేరిలో ఓ ఖరీదైన కమర్షయల్ స్పేస్ ఉండేది. దానిని ఈ మధ్యే 9 కోట్లకు అమ్మేశారు అక్షయ్. ఇక ఇవి కాకుండా అక్షయ్ కుమార్(Akshay Kumar)  కు ముంబయ్ లో ఇతర ప్రాంతాల్లో మరియు గోవా,మారిషస్ లో కూడా వ్యాపారాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఇతర ఆస్తులు ఉన్నాయి.

బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలలో మొదటి వరుసలో వెలుగు వెలుగుతున్నారు అక్షయ్ కుమార్(Akshay Kumar). బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మొదటి 100 కోట్ల రెమ్యూనరేషన్ హీరో. ఇప్పటిదాకా ఒక్కొక్క సినిమాకు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అక్షయ్‌ సిండ్రెల్లా మూవీకి ఏకంగా 135 కోట్లు తీసుకుంటున్నాడని  ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ తో కూడా కోట్లలో సంపాదిస్తున్నాడు అక్షయ్ కుమార్(Akshay Kumar). అటు బడే మియా చోటే మియా మూవీకి కూడా అక్షయ్  ఇంచుమించు 130 కోట్లకు పైనే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం.

click me!