Singer Sunitha: ఇన్‌స్టాలో సునీత వీడియో... వైరల్ !సమ్మోహనపరిచే కంటంట్

By Surya PrakashFirst Published Jan 23, 2022, 4:36 PM IST
Highlights

పాట మాత్రమే కాదు ఇందులో మరో విచిత్రం ఉంది. దాని కోసమే అభిమానులు ఈ వీడియోని వీక్షిస్తూ వైరల్ చేస్తున్నారు. అంత అద్భుతంగా ఉండటానికి ఇందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సునీత ఒక వీడియో పెట్టింది.


ప్రముఖ నేపథ్య గాయని సునీత(Singer Sunitha)కు తెలుగు రాష్ట్రాల్లో,ప్రత్యేకించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో  ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 26 ఏళ్లుగా ఆమె పాటలు పాడుతూ ఎందరో సంగీత ప్రియులను ఫ్యాన్స్ గా  మార్చుకున్నారామె. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆమెను అభిమానిస్తుంటారు.  ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఎప్పుడూ ట‌చ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈమె ఒక వీడియో పెట్టారు. అది వైరల్ అవుతోంది.

అందులో Sunitha పాట పాడుతూ అందర్నీ మైమరిపిస్తోంది. పాట మాత్రమే కాదు ఇందులో మరో విచిత్రం ఉంది. దాని కోసమే అభిమానులు ఈ వీడియోని వీక్షిస్తూ వైరల్ చేస్తున్నారు. అంత అద్భుతంగా ఉండటానికి ఇందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సునీత ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో కనిపిస్తున్న ఒక చిన్నారి… సునీత ఆలపిస్తున్న ఓ వీడియో సాంగ్ చూసి మైమరచిపోయింది. ఈ పాటలో సునీత క్రిమినల్ సినిమాలోని తెలుసా మనసా పాట పాడింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన కె.ఎస్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్ర దానం చేసిన ఈ పాట ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జర్మన్ గ్రూప్ ఎనిగ్మా రూపొందించిన ఏజ్ ఆఫ్ లోన్లీనెస్ (age of loneliness) పాటలోని ట్యూన్ ని కీరవాణి “తెలుసా మనసా” పాట కోసం యూజ్ చేశారు. అయితే ఈ పాటలోని హమ్మింగ్ ను తెలుసా మనసా పాట కోసం అద్భుతంగా రీక్రియేట్ చేసి ప్రాణం పోసింది కె.ఎస్ చిత్ర. అందుకే ఆ పాట ఆ స్థాయిలో హిట్ అయ్యింది.


అయితే తాజాగా సునీత తెలుసా మనసా పాట పాడుతూ ఓ చిన్నారిని సమ్మోహనపరిచింది. ఈ విషయం తెలిశాక చిన్న పిల్లలు కూడా తన పాటలు వింటూ ఆస్వాదిస్తున్నారని సునీత మంత్రముగ్ధురాలైంది. “ఆహా ఏమి ఈ భాగ్యం. నాకు ఈ అదృష్టం ఇచ్చిన దేవుడికి నా ధన్యవాదాలు.” అని సునీత ఓ వీడియో షేర్ చేస్తూ పేర్కొంది.
 

ఈ వీడియో చూసిన సునీత అభిమానులు ఫిదా అవుతున్నారు. “వేల సంవత్సరాల తర్వాత కూడా మీ పాటల గురించి మాట్లాడతారు” అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా మీ పాటలు విని తరిస్తారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

 

 

click me!