అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్' ఫస్ట్ లుక్!

Published : May 18, 2019, 01:50 PM IST
అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్' ఫస్ట్ లుక్!

సారాంశం

దర్శకుడు రాఘవ లారెన్స్ 'ముని' కి సీక్వెల్ గా సిరీస్ లు తీస్తోన్న సంగతి తెలిసిందే. 

దర్శకుడు రాఘవ లారెన్స్ 'ముని' కి సీక్వెల్ గా సిరీస్ లు తీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన కాంచన సిరీస్ మంచి విజయాలు అందుకున్నాయి. రీసెంట్ గా 'కాంచన 3' వచ్చి సక్సెస్ అందుకుంది.

అయితే ఇప్పుడు ఈ సిరీస్ ని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 'కాంచన 2' చిత్రాన్ని కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. తాజాగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా ఇటీవలే సినిమా షూటింగ్ మొదలైంది. 

దీనికి 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. లారెన్స్ పోషించిన పాత్రను అక్షయ్ చేస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో హిజ్రా పాత్రను ఎవరు పోషించబోతున్నారనే విషయంలో అమితాబ్ బచ్చన్ పేరు వినిపిస్తోంది.

కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 20న విడుదల చేయనున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే