లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి..!

Published : Feb 18, 2019, 04:40 PM IST
లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి..!

సారాంశం

ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో నటి శ్రీరెడ్డి కనిపించనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించాడు. 

ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో నటి శ్రీరెడ్డి కనిపించనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించాడు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు పోటీగా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో లక్ష్మీపార్వతి కోసం పెద్ద నటిని తీసుకుంటానని డబ్బాలు కొట్టుకున్న కేతిరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డి దగ్గర ఆగిపోయాడు. తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇటీవలే సినిమా విషయమై శ్రీరెడ్డిని సంప్రదించానని దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఇంకా ఆమెకి సీన్స్ గా కథ చెప్పలేదని, అలా చెప్పిన తరువాత ఆమెకి ఏదైనా అభ్యంతరం ఉంటే అప్పుడు ఆలోచిస్తానని, ప్రస్తుతానికి ఆమెనే ప్రధాన పాత్రధారి అంటూ స్పష్టం చేశాడు.

వీరగ్రంథం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీపార్వతి.. అక్కడ నుండి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడం ఆ తరువాత ఎలాంటి రాజకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయనే విషయాలపై సినిమా ఉంటుందని వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?