ఛత్రపతి శివాజీ మహారాజ్ గా అక్షయ్ కుమార్.. ముంబైలో షూటింగ్ ప్రారంభించిన బాలీవుడ్ స్టార్.. డిటేయిల్స్!

Published : Dec 06, 2022, 01:01 PM IST
ఛత్రపతి శివాజీ మహారాజ్ గా అక్షయ్ కుమార్.. ముంబైలో షూటింగ్ ప్రారంభించిన బాలీవుడ్ స్టార్.. డిటేయిల్స్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తదుపరి చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గా అలరించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ నేడు ముంబైలో ప్రారంభమైంది. దీనిపై అక్షయ్ కుమార్ ఆసక్తికరమై విషయాలను వెల్లడించారు. 

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే ఏకంగా ఆరు సినిమాలను విడుదల చేశారు. అంటే అక్షయ్ కుమార్  ఎంతి బిజీ షెడ్యూల్ లో ఉన్నారనేది అర్థం అవుతోంది. ఇక 2023లోనూ విడుదలకు సిద్ధం అవుతున్న చిత్రాల షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో మరో చారిత్రాత్మక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తొలిసారిగా మరాఠీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) దర్శకత్వం వహిస్తున్నారు. మూవీకి వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు. 

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తున్నారు. ఈరోజు మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్  సోషల్ మీడియా  ద్వారా తెలియజేశారు. ‘ఈ రోజు నేను మరాఠీ చిత్రం ‘వేదాత్ మరాఠే వీర్ దౌడలే సత్’ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాను. ఇందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీ పాత్రను పోషించడం నా అదృష్టం. ఆయన జీవితం, తల్లి జిజావు ఆశీర్వాదంతో ప్రేరణ పొందాను. నా వంతు కృషి చేస్తాను! మీ ఆశీర్వాదం కూడా మాపై ఉండాలి’ అని కోరారు. 

‘వేదాత్ మరాఠే వీర్ దౌడలే సాత్’ ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా మరాఠీ భాషాలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయ్ దుధానే, ఉత్కర్ష షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్, ప్రవీణ్ టార్డే నటిస్తున్నారు. ఖురేషి ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరాఠీ, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో 2023 దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !