బాక్స్ ఆఫీస్: అక్షయ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్

Published : Aug 26, 2019, 12:54 PM IST
బాక్స్ ఆఫీస్: అక్షయ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్

సారాంశం

  డిఫరెంట్ కథలను ఎంచుకోవడమే కాకుండా తన సినిమాల ద్వారా ఎంతో కొంత సందేశాన్ని అందిస్తూ ఉంటాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. రియాలిస్టిక్ కథలతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అక్షయ్ మరోసారి మిషిన్ మంగళ్ సినిమాతో తన సత్తా చాటారు

డిఫరెంట్ కథలను ఎంచుకోవడమే కాకుండా తన సినిమాల ద్వారా ఎంతో కొంత సందేశాన్ని అందిస్తూ ఉంటాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. రియాలిస్టిక్ కథలతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అక్షయ్ మరోసారి మిషిన్ మంగళ్ సినిమాతో తన సత్తా చాటారు. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజైన సంగతి తెలిసిందే. 

విడుదలైన 11రోజులకే మిషిన్ మంగళ్ 150కోట్ల వసూళ్లను అందుకుంది. ఈ సినిమా ద్వారా వరుసగా  మూడవసారి 150కోట్ల వసూళ్లు అందుకున్న హీరోగా నిలిచాడు. గత ఏడాది విడుదలైన 2పాయింట్ఓ సినిమా ఈ రికార్డును అందుకోవడానికి 10రోజుల సమయం మాత్రమే పట్టింది. ఇక కేసరి సినిమా 25రోజుల్లో 150కోట్ల వసూళ్లను అందుకుంది. 

చాలా తక్కువ వ్యవధిలో అక్షయ్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకొని తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. ఇక నెప్రస్తుతం వరుసగా నాలుగు ప్రాజెక్టులతో అక్షయ్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఫోర్బ్స్ రిలీజ్ చేసిన అత్యధిక ధనవంతులైన యాక్టర్స్ లిస్ట్ లో అక్షయ్ నాలుగవ స్థానంలో నిలిచాడు. 

PREV
click me!

Recommended Stories

Shanmukh: దీప్తి సునైనాతో బ్రేకప్.. కొత్త అమ్మాయిని పరిచయం చేసిన షణ్ముఖ్,త్వరలో పెళ్లి
బాలకృష్ణ వద్దనుకున్న హీరోయిన్ తో రొమాన్స్ చేయాలనుకున్న తారక్.. ఆ కోరిక ఈ జన్మకి తీరదు, మరీ అంత పిచ్చా ?