నాని ‘గ్యాంగ్‌లీడర్‌’కథ ఇదే..ఫుల్ ఫన్!

By AN TeluguFirst Published Aug 26, 2019, 12:33 PM IST
Highlights

'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలో నాని ఓ నవలా రచయత. హాలీవుడ్‌ సినిమాల డివిడిలు చూసి కాపీ కథలతో పుస్తకాలు రాసేస్తూంటాడు. అతనికి రివేంజ్ కథలంటే తెగ ఇష్టం.  అలాంటి కథలే రెగ్యులర్ గా రాస్తూండటంతో అవి హిట్ అయ్యి..అతను చాలా తెలివైన వాడు అనే పేరు వచ్చేస్తుంది. రివేంజ్ కు అతని దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయని జనం అనుకుంటూంటారు. 

నాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌  హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ విలన్ గా నటించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 28న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. ఫుల్ ఫన్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలిసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా చర్చనీయాంసంగా మారింది. 

ఈ సినిమాలో నాని ఓ నవలా రచయత. హాలీవుడ్‌ సినిమాల డివిడిలు చూసి కాపీ కథలతో పుస్తకాలు రాసేస్తూంటాడు. అతనికి రివేంజ్ కథలంటే తెగ ఇష్టం.  అలాంటి కథలే రెగ్యులర్ గా రాస్తూండటంతో అవి హిట్ అయ్యి..అతను చాలా తెలివైన వాడు అనే పేరు వచ్చేస్తుంది. రివేంజ్ కు అతని దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయని జనం అనుకుంటూంటారు.

ఈ క్రమంలో అతన్ని నమ్మి ...హీరోయిన్ ప్రియా మోహన్ ... రివెంజ్‌ కోసం చూస్తోన్న అయిదుగురు ఆడాళ్లు ని తీసుకువచ్చి సాయిం చేయమంటుంది. ఆమె దగ్గర చిన్నతనం కాకూడదని, తనకు ధైర్యం లేకపోయినా, ఆ తెలివి లేకపోయినా...తప్పనిసరి పరిస్దితుల్లో వారు రివేంజ్ తీర్చుకునేందుకు సహకరించేందుకు ఒప్పుకుంటాడు. 

అలాగే పనిలో పనిగా తాను చేసే పనులనే నవలగా రాసేయాలని భావిస్తాడు. కానీ అతనికి రివేంజ్ తీర్చుకునే  కనీస స్కిల్స్‌ కూడా లేకపోవడంతో పాటు ఈ ఆడాళ్లంతా   కూడా శుద్ధ అమాయలు కావటంతో ఇబ్బందులు పడతారు. గొప్పకోసం ఒప్పుకున్న ఈ పని.. ఒక పవర్‌ఫుల్‌ విలన్‌ని ఢోకొనాల్సిన పరిస్థితికు దారి తీస్తుంది. వాళ్లందరి కామన్ విలన్ ..కార్తికేయ అని, అతనో బైక్ రేసర్ అని, బ్యాంక్ ని ముంచేసాడని, ఆ బ్యాంక్ లోనే వాళ్లందరి డబ్బులు ఉన్నాయని అర్దమవుతుంది. దాంతో  ఆ రైటర్‌  గ్యాంగ్‌లీడర్‌ గా మారి ఎలా సాయిం చేసాడనేది మిగతా కథ.

click me!