కన్నప్ప నుంచి మంచు విష్ణు కూతుళ్ల స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్, సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

Published : May 27, 2025, 07:22 PM IST
 Kannappa Song Promo Out Ariana Viviana Lyrical Video

సారాంశం

మంచు విష్ణు ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మైథలాజికల్ డ్రామా ‘కన్నప్ప. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమాకు సబంధించి వరుస అప్ డేట్ లు వదులుతున్నారు కన్నప్ప టీమ్.

మంచు విష్ణు ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప.  విష్ణు హీరోగా  బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మైథలాజికల్ డ్రామా ‘కన్నప్ప. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు టీమ్. ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి వరుస అప్ డేట్ లు వదులుతున్నారు కన్నప్ప టీమ్.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఈ చిత్రం ద్వారా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, విరియానా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తొలిసారి స్క్రీన్‌పై కనిపించబోతున్న ఈ ట్విన్స్ పాత్రలపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ ఇద్దరిపై రూపొందించిన ‘శ్రీకాళహస్తి’ లిరికల్ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.

ఈ పాట లిరికల్ వీడియోను మే 28న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నట్లు మోహన్ బాబు గతంలో ప్రకటించారు. శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా రూపొందించిన ఈ పాటలో అరియానా, వివియానా ప్రధానంగా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇక ‘కన్నప్ప’ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణుతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ భారీ మల్టీ-లాంగ్వేజ్ చిత్రాన్ని మోషన్ పిక్చర్స్, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా, సంగీతాన్ని స్టీవెన్ దేవాస్ అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా కొనసాగుతుండగా, లిరికల్ వీడియో రీలీజ్‌తో మళ్ళీ సినిమాపై ఆసక్తి పెరుగనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rakul Preet Singh: బాలీవుడ్ లో కుట్రలు ఉంటాయి, టాలీవుడ్ లో ఐక్యత ఉంటుంది.. మంటలు రేపుతున్న రకుల్ కామెంట్స్
Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?