ఆ కాన్సెప్టే నాకు నచ్చదు.. బిగ్ బాస్ పై నాగార్జున కామెంట్స్!

By Udayavani DhuliFirst Published 26, Sep 2018, 2:05 PM IST
Highlights

నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిందీ, తమిళం, మరాఠీ భాషలతో పాటు తెలుగులో కూడా ఈ షోకి ప్రేక్షకాదరణ దక్కింది. 

నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిందీ, తమిళం, మరాఠీ భాషలతో పాటు తెలుగులో కూడా ఈ షోకి ప్రేక్షకాదరణ దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ఆడియన్స్ ఈ షోని మిస్ కాకుండా చూసేస్తుంటారు.

మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 2 ముగియనుంది. ప్రతివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో గెస్ చేసిన ఆడియన్స్ కి ఇప్పుడు విన్నర్ గా ఎవరు గెలుస్తారనే విషయంలో మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.

చాలా మంది నటీనటులు ఈ షోపై తమ స్పందన తెలియజేశారు. తాజాగా సీనియర్ హీరో నాగార్జున కూడా బిగ్ బాస్ షోపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగార్జునకి బిగ్ బాస్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

దీనికి సమాధానంగా.. ''బిగ్ బాస్ గురించి వద్దులే.. బ్యాడ్ గా మాట్లాడతాను. నాని గురించి కాదు కానీ నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చదు. ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడో.. చూసి దాని కారణంగా కిక్ పొందడం నాకు నచ్చదు. అదంతా నాకు గాసిపింగ్ లా అనిపిస్తుంది'' అని వెల్లడించారు. 

Last Updated 26, Sep 2018, 2:05 PM IST