
సమంత చైతూ.. ముందులా ఎవరికీ తెలియకుండా చాటు మాటు వ్యవహారాలు నడిపించడం మానేసి కొన్ని రోజులుగా ఓపెన్ గానే కలిసి తిరగడం, డేట్ కు వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం...'అవి లేకపోతే నేను జీవించలేను అనే వాటిలో మూడు చెప్పండి' అని ఓ ఫ్యాన్ అడగ్గా స్పందిస్తూ.. 'చైతూ, మస్కతీ ఐస్‌క్రీమ్, వర్క్' అని సమాధానమిచ్చింది సమంత.
ఇక నాగచైతన్య...'ఏమాయ చేసావే' సినిమా చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే 'బెస్ట్ ఫ్రెండ్స్'గా మారిపోయామని, ఆ స్నేహమే ఒకరిపై ఒకరికి మరింత ఇష్టాన్ని పెంచింది. తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని చెప్పుకొచ్చారు. మేము ఇంతకాలం స్నేహం చేసామా? ప్రేమలో ఉన్నామా? అంటే చెప్పడం కష్టమే. మేము ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయని ఊహిచుకోలేకపోయాను అని చైతు తెలిపారు.