పవన్ కళ్యాణ్ ను గుర్తు చేస్తూ.. రేణు దేశాయ్ ని సర్ ప్రైజ్ చేసిన అకీరా నందన్

Published : Dec 10, 2023, 01:22 PM ISTUpdated : Dec 10, 2023, 01:37 PM IST
పవన్ కళ్యాణ్ ను గుర్తు చేస్తూ.. రేణు దేశాయ్ ని సర్ ప్రైజ్ చేసిన అకీరా నందన్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. నటి రేణు దేశాయ్ కు .. సర్ ప్రైజ్ ఇచ్చాడు ఆమె తనయుడు అకీర నందన్. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ సంగతేంటి.   


హీరోయిన్ గా, పవన్ మాజీ భార్యగా రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలం క్రితం నటనకు స్విస్థి చెప్పిన ఆమె.. తాజాగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు  సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమాలో హేమలతా లవణం పాత్రలో అద్భుతం చేసింది. ఇక అప్పుడప్పుడు టీవీ షోలు, ఇంటర్వ్యూలతో సందడి చేస్తుంటుంది రేణు. సినిమాల్లో యాక్టీవ్ గా లేకపోయినా.. ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటుంది. 

సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది రేణు దేశాయ్. తన పిల్లల పెరుగదల, వారి టాలెంట్.. చదువు.. ఇలా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది. ఈక్రమంలో కొన్ని విమర్షలు, గొడవలు. పవన్ ఫ్యాన్స్ కు ఆమె వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేస్తుంటుది.   ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంది.  దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయి. 

కోడలికి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్, లిస్ట్ నుంచి ఐశ్వర్యరాయ్ ఔట్..?
పవన్ – రేణు దేశాయ్ పిల్లలు అకిరా నందన్, ఆద్యలు రేణు దేశాయ్ దగ్గరే ఉంటారని తెలిసిందే. ప్రస్తుతం అకిరా(Akira Nandan) అమెరికాలో ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో మ్యూజిక్ కి సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నాడు. భవిష్యత్తులో అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని సమాచారం. ఇటీవల డిసెంబర్ 4న రేణు దేశాయ్ పుటిన రోజు కావడంతో పలువురు అభిమానులు, ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తనయుడు అకిరా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.

 

జానీ సినిమాలో రేణు దేశాయ్ షాట్స్ కొన్ని కట్ చేసి సప్త సాగరాలు దాటి సినిమాలోని సాంగ్ తో ఎడిట్ చేసి ఓ వీడియోని రూపొందించాడు అకిరా. ఇందులో పవన్ కళ్యాణ్ షాట్స్ కూడా ఉండటం విశేషం. ఈ వీడియోని రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. నా కొడుకు నా బర్త్ డేకి ఈ గిఫ్ట్ ఇచ్చాడు అని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అకిరా బాగా ఎడిట్ చేశాడని, వీడియో బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?
Vishnu Vinyasam First Review: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే