బాలీవుడ్ కాంచనలో తెనాలి పిల్ల

Published : Mar 03, 2019, 10:47 AM IST
బాలీవుడ్ కాంచనలో తెనాలి పిల్ల

సారాంశం

  బాలీవుడ్ లో రీమేక్ ల హావ తగ్గుతోంది అనుకుంటున్న సమయంలో ప్రయోగాల కథానాయకుడు అక్షయ్ కుమార్ ఒక హారర్ కథను రీమేక్ చేయబోతున్నాడు. రాఘవ లారెన్స్ కాంచన సినిమాను అక్షయ్ హిందీలో రెడీ చేబోతున్నాడని గత ఏడాదే న్యూస్ వచ్చింది.

బాలీవుడ్ లో రీమేక్ ల హావ తగ్గుతోంది అనుకుంటున్న సమయంలో ప్రయోగాల కథానాయకుడు అక్షయ్ కుమార్ ఒక హారర్ కథను రీమేక్ చేయబోతున్నాడు. రాఘవ లారెన్స్ కాంచన సినిమాను అక్షయ్ హిందీలో రెడీ చేబోతున్నాడని గత ఏడాదే న్యూస్ వచ్చింది. అయితే సినిమా పట్టాలెక్కడానికి సమయం ఎక్కువే పడుతోంది. ఇక  లెట్ చేయకూడదని కేసరి సినిమా పనులు అయిపోగానే రీమేక్ పై కన్నేశాడు అక్షయ్. 

అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ హారర్ అండ్ ఎమోషనల్ కథలో తెలుగమ్మాయి నటిస్తుండడం విశేషం. గూఢచారి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెనాలి పిల్ల అక్షయ్ తో నటించడానికి రెడీ అయ్యింది. ఏపి తెనాలిలో జన్మించిన ఈ మోడల్ గత కొంత కాలంగా ముంబైలో సినీ కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇక 2011లో తెలుగు తమిళ్ లో  వచ్చిన కాంచన బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో లక్ష్మి రాయ్ హీరోయిన్ గా నటించింది. ఇక బాలీవుడ్ కాంచన లో శోభిత హీరోయిన్ నటించడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ చేయాలనీ అక్షయ్ ప్లాన్ చేస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

NTR: కృష్ణ, ఎన్టీఆర్ సినిమాలకు చుక్కలు చూపించిన చిన్న హీరో..స్టార్ కాలేదు, ఆస్తులు మాత్రం వందల కోట్లు ?
Thimmarajupalli TV Collections: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కలెక్షన్లు.. కొత్త కుర్రాళ్ల సినిమాకి ఈ రేంజ్‌లో వసూళ్లా?