బూమ్..ఫుల్ యాక్షన్ :‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ వచ్చేసింది

Published : Mar 03, 2019, 09:15 AM IST
బూమ్..ఫుల్ యాక్షన్ :‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ వచ్చేసింది

సారాంశం

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ వాంటెండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ . ఈ చిత్రం యొక్క ‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ విడుదలకోసం ప్రభాస్ అభిమానులు  చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా ఈ రోజు ఉదయం 8:20 గంటలకు ఈ టీజర్ ను విడుదలచేసారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. పూర్తి యాక్షన్ తో ఆ వీడియో నిండిపోయింది.

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది.    యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న  ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది.  నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను  ఆనంద్, మందిరా బేడీ వంటి పలువురు హిందీ నటులు ఇందులో నటిస్తున్నారు.

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నిల్ నితిన్ ముఖేష్  విలన్  పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. శంకర్-ఎహసాన్ -లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 15న తెలుగు , హిందీ , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.

దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.40 కోట్ల వరకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తో పాటు  ప్రభాస్‌ జిల్  రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!