పెళ్ళి విషయంలో తడబడుతున్న అఖిల్‌.. అయ్యో పాపం!

Published : Oct 19, 2020, 10:43 AM ISTUpdated : Oct 19, 2020, 02:06 PM IST
పెళ్ళి విషయంలో తడబడుతున్న అఖిల్‌.. అయ్యో పాపం!

సారాంశం

అఖిల్‌ ప్రస్తుతం `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తున్నాడు. `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అఖిల్‌ సరసన రొమాన్స్ చేస్తుంది. 

అక్కినేని హీరో అఖిల్‌ కెరీర్‌ని బాగానే ప్లాన్‌ చేశాడు. కానీ పెళ్ళి విషయంలోనే తడబడుతున్నాడు. మ్యారేజ్‌ లైఫ్‌ తనని షేక్‌ చేస్తుందట. ఒంటికాలిపై సాహసంలా మారిందని వాపోతున్నాడు. ఆయన బాధని చూసి అభిమానులు సైతం అయ్యో పాపం అంటున్నారు. మరి పెళ్ళి కాకుండానే అఖిల్‌ మ్యారేజ్‌ లైఫ్‌ విషయంలో ఎలా తడబడుతున్నాడనే డౌట్‌ వస్తోందా? అక్కడికే వస్తున్నా. 

అఖిల్‌ ప్రస్తుతం `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తున్నాడు. `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.  బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం ప్రీ టీజర్‌ని విడుదల చేశారు. ఇందులోనే అఖిల్‌ పెళ్లి విషయంలో పట్టుతప్పుతున్నాడట. 

`హాయ్‌.. ఐ యామ్‌ హర్ష. ఒకబ్బాయి లైఫ్‌లో 50శాతం కెరీర్‌, మరో యాభై శాతం మ్యారీడ్‌ లైఫ్‌. కెరీర్‌ని సూపర్‌గా సెట్‌ చేశా. కానీ ఈ మ్యారీడ్‌ లైఫే.. అంటూ ఒంటికాలిపై నిలబడి రెండు చేతులు చాచి అయ్యయ్యో.. ` అంటూ తడబడుతున్నాడు. తాజాగా ఈ ప్రీ టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. అఖిల్‌పై రకరకాల కామెంట్లతో ఆయన అభిమానులు రెచ్చిపోతున్నారు. అఖిల్‌ రియల్‌ లైఫ్‌లో ఇప్పటికే ఓ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత అది బ్రేకప్‌ అయ్యింది. దానికి కారణాలేంటనేది మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్‌ని దసరా కానుకగా ఈ నెల 25న ఉదయం 11.40 నిమిషాలకు విడుదల చేయనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?