దుబాయ్‌లో అనుష్క శర్మతో కొహ్లీ రొమాన్స్.. పిక్‌ అదిరిపోయింది!

Published : Oct 19, 2020, 07:46 AM IST
దుబాయ్‌లో అనుష్క శర్మతో కొహ్లీ రొమాన్స్.. పిక్‌ అదిరిపోయింది!

సారాంశం

కొహ్లీ, అనుష్కలు సముద్రంలో దగ్గరగా ఒకరికొకరు చూసుకుంటూ రెచ్చిపోయారు. సాయంత్రం వేళ ఇలా ఘాటు రొమాన్స్ దిగడంతో అది చూసి ఆగలేని సౌత్‌ ఆఫ్రికన్‌ క్రికెటర్‌ ఏబీ డి విలియర్స్ టక్‌ మని ఓ ఫోటో క్లిక్‌మనిపించాడు. 

ఓ వైపు ఐపీఎల్‌ క్రికెట్‌ లో భాగంగా గ్రౌండ్‌లో పరుగులతో రెచ్చిపోతున్న విరాట్‌ కొహ్లీ.. మరోవైపు రొమాన్స్ లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. తన భార్య, హీరోయిన్‌ అనుష్క శర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. 

తాజాగా కొహ్లీ, అనుష్కలు సముద్రంలో దగ్గరగా ఒకరికొకరు చూసుకుంటూ రెచ్చిపోయారు. సాయంత్రం వేళ ఇలా ఘాటు రొమాన్స్ దిగడంతో అది చూసి ఆగలేని సౌత్‌ ఆఫ్రికన్‌ క్రికెటర్‌ ఏబీ డి విలియర్స్ టక్‌ మని ఓ ఫోటో క్లిక్‌మనిపించాడు. ఆ ఫోటోని తాజాగా కొహ్లీ తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఆదివారం రాత్రి అభిమానులతో పంచుకున్నారు. 

వెనకాల పెద్ద కోట కనిపిస్తుండగా, నీటిలో కొహ్లీ, అనుష్క స్విమ్మింగ్‌ చేస్తూ ఒకరినొకరు చూసుకుంటున్న ఈ ఫోటోకి విశేష స్పందన లభిస్తుంది. నెటిజన్లు, కొహ్లీ,అనుష్క ల అభిమానులు అభినందనలతో  కూడిన కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొహ్లీ ఐపీఎల్‌ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నారు. కొహ్లీతోపాటు అనుష్క శర్మ కూడా దుబాయ్‌లోనే ఉంది. దీంతో మ్యాచ్‌ లేని రోజు విరాట్‌ కొహ్లీ ఇలా ఫ్యామిలీ కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆగస్ట్ నెలలో కొహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్