18 పేజెస్... ప్రీ లుక్ తో అదరగొట్టిన హీరో నిఖిల్!

Published : May 28, 2021, 08:14 PM IST
18 పేజెస్... ప్రీ లుక్ తో అదరగొట్టిన హీరో నిఖిల్!

సారాంశం

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న 18పేజెస్ మూవీ ప్రీ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. నోటిలో సిగరెట్ పెట్టుకొని, చేతిలో ఉన్న పేపర్ ని కాల్చుతూ సీరియస్, ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు నిఖిల్.

యంగ్ హీరో నిఖిల్ మరో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 18పేజెస్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథా, స్క్రీన్ ప్లే అందించగా ఆయన శిష్యుడు పలనాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. 


రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈమూవీ ప్రీ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. నోటిలో సిగరెట్ పెట్టుకొని, చేతిలో ఉన్న పేపర్ ని కాల్చుతూ సీరియస్, ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు నిఖిల్. కాగా 18 పేజెస్ ఫస్ట్ జూన్ 1న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

 
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నారు. ఇక మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ కి జంటగా నటిస్తున్నారు. 18పేజెస్ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. 


అర్జున్ సురవరం మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 మూవీలో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఇక 18 పేజెస్ మూవీపై కూడా పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Highest Multistarrer: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?