అఖిల్ అక్కినేని కొత్త చిత్రం ప్రారంభం

Published : Apr 03, 2017, 11:44 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
అఖిల్ అక్కినేని కొత్త చిత్రం ప్రారంభం

సారాంశం

అఖిల్ హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో కింగ్ నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై 'కింగ్'  నాగార్జున నిర్మిస్తున్న భారీ చిత్రం 'ప్రొడక్షన్ నెం : 29 '  అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏప్రిల్ 2 న సాయంత్రం 6 : 17 కి అక్కినేని కుటుంభ సభ్యుల సమక్షంలో ప్రారంభం అయింది. అక్కినేని ముని మనవరాళ్ళు సత్య సాగరి క్లాప్ ని ఇవ్వగా , దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు బి ఏ  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దేవుడి పటాల మీద తొలి షాట్ చిత్రీకరించారు. హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, నిర్మాత అక్కినేని నాగార్జున, అక్కినేని  అమల, నాగ చైతన్య, సుప్రియ, ఎ. నాగ సుశీల, సుమంత్, సుశాంత్, యార్లగడ్డ సురేంద్ర ఈ కార్యక్రమానికి విచ్చేసారు.

 

చిత్ర నిర్మాత 'కింగ్'  నాగార్జున మాట్లాడుతూ, " 'మనం' టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో  ట్రెండ్ సెట్టర్ అవుతుంది."  ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అయన అన్నారు.   

 

ఈ సందర్భంగా, దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ " అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో 'మనం' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో  ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అఖిల్ కి ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం అవుతుంది " అన్నారు 

 

ఈ చిత్రానికి  సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : పి.ఎస్. వినోద్, ఆర్ట్ : రాజీవన్ , ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం : విక్రమ్ కె కుమార్.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి