రాజు తలచుకుంటే వరాలకు కొదవా, ప్రజల వలె చిత్ర పరిశ్రమను రక్షించండి.. సీఎం జగన్ కి అల్లు అరవింద్ విజ్ఞప్తి

By team teluguFirst Published Sep 30, 2021, 7:19 PM IST
Highlights

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్(Allu aravind) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి(CM Jagan) కొన్ని విజ్ఞప్తులు చేశారు. అల్లు అరవింద్ తన స్పీచ్ లో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని వెంటనే పరిష్కరించాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. 

 
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ట్రైలర్ విడుదల వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. అల్లు అరవింద్ తన స్పీచ్ లో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని వెంటనే పరిష్కరించాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. 

కరోనా సమయంలో ప్రజలను కాపాడిన విధంగా చిత్ర పరిశ్రమను కాపాడాలని కోరుకున్నారు. రాజు తలచుకుంటే వరాలకు కొదవా... మీరు సత్వరమే చిత్ర పరిశ్రమ సమస్యల గురించి ఆలోచించాలి అన్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అరవింద్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 కాగా ప్రస్తుతం వైసీపీ జనసేన వర్గాల మధ్య భీకర వాతావరణం నెలకొంది. నిన్న బడా నిర్మాతలు డివివి దానయ్య, దిల్ రాజు, వంశీ రెడ్డి, నవీన్ ఎర్నేని మంత్రి పేర్ని నానిని మచిలీపట్టణంలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నేపథ్యంలో నేడు అల్లు అరవింద్ సీఎం జగన్ ని అభ్యర్థించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గట్టిగా మాట్లాడి పోరాడాలని పవన్ కోరుకుంటుంటే పరిశ్రమ పెద్దలు ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున సైతం ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

click me!