‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ వచ్చేది అప్పుడేనా

By Surya Prakash  |  First Published Aug 17, 2021, 1:20 PM IST

: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్  ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది.


అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే హీరోయిన్.  బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా నెలలుగా సన్నాహాలు చేస్తున్నారు. మధ్యలో కరోనా వచ్చి చాలా డిస్ట్రబ్ చేసేసింది.  ఓ టైమ్ లో ఓటీటికు ఈ సినిమా ఇచ్చేస్తున్నారని అనుకున్నారంతా. సినిమా అతి త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుందంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి.  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ హక్కులు కొనుగోలు చేసిందని నెట్టింట్లో వరుస పోస్టులు దర్శనమిచ్చాయి.  

ఈ నేపథ్యంలో సదరు వార్తలపై చిత్ర టీమ్ ఓ క్లారిటీ ఇచ్చింది. ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన తమకు లేదని స్పష్టతనిచ్చింది. థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాకే రిలీజ్‌ డేట్‌ని మరోసారి ప్రకటిస్తామని చిత్రటీమ్ తెలిసింది. అయితే ఇప్పుడు ఆ రోజులు వచ్చినట్లు కనపడుతున్నాయి. పరిస్దితులు కాస్త చక్కబడి థియోటర్స్ తెరుచుకోవటంతో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ లు వేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను దసరా పండగకు విడుదల చేసే అవకాసం ఉంది. అయితే ఈ లోగా చిరంజీవి ఆచార్య సీన్ లోకి వస్తే ఆలోచనలో పడాలి. డేట్ మార్చాలి. ఈ విషయమై టీమ్ ఓ డెసిషన్ తీసుకుని త్వరలోనే ఓ ప్రకటన చేద్దామనుకుంటున్నారట.ఏదైమైనా దసలా లక్ష్యంగా ముస్తాబవుతోంది. 

Latest Videos

ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్‌ సరసన పూజాహెగ్డే నటించారు. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్‌ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రదీశ్‌ ఎమ్‌.వర్మ. 
  

click me!