ఇంటీరియర్‌ డిజైనర్ వేధింపులు.. పోలీసులకు నటి ఫిర్యాదు

Published : Aug 17, 2021, 12:49 PM IST
ఇంటీరియర్‌ డిజైనర్ వేధింపులు.. పోలీసులకు  నటి ఫిర్యాదు

సారాంశం

నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు.  అరెస్ట్ చేయడానికి ముందు పోలీసులు దీనిలో వాస్తవాలపై విచారణ చేపడుతున్నారు. 

తనని ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ వేధిస్తున్నాడని బాలీవుడ్‌ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజులుగా ఆయన తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెబుతూ నటి ముంబయిలోని ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు.  అరెస్ట్ చేయడానికి ముందు పోలీసులు దీనిలో వాస్తవాలపై విచారణ చేపడుతున్నారు. 

అయితే నటి తన ఫిర్యాదులో ఆ ఇంటీరియర్‌ డిజైనర్‌ నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ, నటి అంథేరిలోని కొత్త అపార్ట్ మెంట్ కొన్నది. అందులో ఇంటీరియర్ వర్క్ చేయిస్తుంది.ఇంటీరియర్ డిజైనర్లు ఆ వర్క్ చేస్తున్నారు. వాళ్ల వర్క్ నటికి నచ్చలేదు. నాణ్యతలేని డిజైనింగ్స్ ని చూసి ఆమె మండి పడింది. దీంతో ఇంటీరియర్ డిజైనర్‌కి, నటికి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం పెరగడంతో నటిపై డిజైనర్‌ అసభ్యకరమైన పదజాలంతో దూషించడం మొదలు పెట్టాడు. ఆమెని బెదిరింపులకు దిగుతున్నా` అని పోలీసులు తెలిపారు.

నటి ఫిర్యాదు మేరకు నిందితుడిపై `ఐపీఎస్‌ సెక్షన్‌ 354, 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ నటి ఎవరనేది మాత్రం రివీల్‌ చేయలేదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?