
‘హలో’బిజినెస్, ఆ హీరోలను దాటేసిన అఖిల్!
అక్కినేని అఖిల్ తన పేరుతోనే ఓ సినిమా తీశాడని, అది రిలీజై వెళ్లిపోయిందని కొందరికి గుర్తున్నా.. చాలా కాలం గ్యాప్ రావటంతో అఖిల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మళ్లీ అఖిల్ గ్రాండ్ రీ ఎంట్రీ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. తొలి సినిమా భారీ అంచనాల మధ్యన వచ్చి డిజాస్టర్ గా నిలిచినా... అఖిల్ రెండో సినిమాపై దాని తాలూకు ప్రభావం ఏమీ కనిపించడం లేదు. పైగా గ్యాప్ రావటంతో అఖిల్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఫ్యాన్స్ వెయిటింగ్ అలా వుంచితే ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్ భారీగా వుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ సినిమా భారీగానే వ్యాపారం చేస్తోందని వినిపింపజేస్తోంది. సక్సెస్ ఫుల్ దర్శకుడు విక్రమ్ పై ఉన్న నమ్మకం.. మరోవైపు అఖిల్ కు ప్రేక్షకులు రెండో ఛాన్స్ ఇస్తారనే నమ్మకం.. కలిపి అఖిల్ తండ్రి, హలో నిర్మాత అయిన నాగార్జున ‘హలో’తో భారీగానే సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.
హలో.. ప్రీ రిలీజ్ బిజినెస్ తో తన కన్నా సీనియర్లయిన హీరోల రేంజ్ ను దాటేస్తున్నాడు అఖిల్. ఇలా అఖిల్ దాటేస్తున్న హీరోల్లో అన్న నాగచైతన్య కూడా ఉన్నాడట. నాగార్జున, శర్వానంద్, నాని.. తదితర హీరోల సినిమాల బిజినెస్ స్థాయిని అఖిల్ ‘హలో’మూవీ దాటేస్తుందని తెలుస్తోంది.
ఇక శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ రైట్స్ .. వీటితో మరింత మొత్తం సమకూరే అవకాశం ఉంది. ఇలా చూస్తే.. ఇప్పటికే కొన్ని విజయాలను ఖాతాలో కలిగిన హీరోల కంటే అఖిల్ సినిమా భారీ వ్యాపారాన్నే చేస్తున్నట్టు. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ వరస విజయాల మీద ఉండటం కూడా హలో ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయికి రీచ్ అవుతుండటానికి ఇక కారణం.
హలో సినిమా సీడెడ్ రైట్స్ ఐదు కోట్ల రూపాయల పలికాయంటే.. బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రా, నైజాం రైట్స్ పదిహేను కోట్ల వరకూ పలికాయట. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని మరో పదిహేను కోట్ల రూపాయల వరకూ దక్కుతున్నాయని సమాచారం. స్థూలంగా ఈ సినిమా థియేటరికల్ బిజినెస్ 35 కోట్ల రూపాయల వరకూ జరుగుతోందని టాక్.