హలో మూవీలో అఖిల్ డ్యూయల్ రోల్?

Published : Sep 13, 2017, 05:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
హలో మూవీలో అఖిల్ డ్యూయల్ రోల్?

సారాంశం

అఖిల్ తాజా చిత్రం ‘హలో’ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హలో నెట్టింట సందడి చేస్తున్న  హలో పోస్టర్లు

అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘హలో’. ‘అఖిల్’ సినిమాతో తెరంగేట్రం చేసిన  అఖిల్.. ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే నెట్టింట సందడి చేశాయి.

 

ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా మందిని వెతికి చివరికి కళ్యాణి ప్రియదర్శిణిని ఎంపిక చేశారు. ఆమెతో అఖిల్ చేస్తున్న రోమాన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటిస్తోందట. తమిళంలో  మగళిర్ మట్టమ్  అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నివేదితా సతీష్ ని ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఇప్పటికే నివేదితా ‘హలో’ షూటింగ్ లో కూడా పాల్గొంటుందట.

 

 అయితే.. ఈ సినిమాకు సంబంధించి మరో ప్రచారం కూడా ఊపందుకుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతునన్న ఈ చిత్రంలో అఖిల్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇద్దరు హీరోయిన్లను ఎంచుకున్నారని అంటున్నారు సినీ జనాలు. మరి ఇది ఎంత వరకు నిజమో చిత్ర బృందం చెప్పేవరకు ఎదురు చూడాలి. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?