అఖిల్ రెండో సినిమాకు వెరైటీ టైటిల్

Published : Mar 14, 2017, 12:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అఖిల్ రెండో సినిమాకు వెరైటీ టైటిల్

సారాంశం

అఖిల్ రెండో సినిమా టైటిల్ ఖరారు విక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమా ఏప్రిల్ 1న ప్రారంభం ఈ సినిమా టైటిల్ జున్ను  

అక్కినేని అఖిల్ ను వివాదాలు వదలటంలేదు. అఖిల్ తొలి సినిమా విషయంలో చివరిదాకా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఎంతో మంది కథలు.. ఎందరో దర్శకుల పేర్లు పరిశీలించాక.. చివరికి వెలిగొండ శ్రీనివాస్ కథతో వివి.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేశాడు అఖిల్. ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారనే విషయంలో కూడా చాలా పెద్ద చర్చే జరిగింది. చివరకు ఆ సినిమాకు తన పేరునే పెట్టుకుని ఆశ్చర్యపరిచాడు అఖిల్. ఆ సినిమా ఫలితం ఏంటో తెలిసిందే.

 

ఇక అఖిల్ రెండో సినిమా విషయంలోనూ అఖిల్ పెద్ద సస్పెన్స్ డ్రామా నడిపించాడు. ఎట్టకేలకు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ఏప్రిల్ 1న మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తన తొలి సినిమా తరహాలో సినిమా పూర్తయ్యే దశలో టైటిల్ ఫిక్స్ చేయాలనుకోవట్లేదు అఖిల్. రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి ముందే దీనికి టైటిల్ కన్ఫమ్ చేసేస్తున్నట్లు సమాచారం.



విక్రమ్ కుమార్ సినిమాలన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. అలాగే టైటిళ్లు కూడా. అఖిల్ సినిమా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ చిత్రానికి ‘జున్ను’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ టైటిల్‌ను ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేయించారట. మరి ఈ ‘జున్ను’ అనే టైటిలేంటో.. దీనికి కథకు ఏం సంబంధమో తెలియట్లేదు. విక్రమ్ టైటిళ్ల వెనుక ఏదో ఒక మర్మం లేకుండా ఉండదు. కాబట్టి ‘జున్ను’ పేరు పెట్టాలనుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి టైటిల్ తగ్గట్టు సినిమా జున్ను మీగడలా ఉంటుందా లేక వివాదాస్పదమవుతుందా చూడాలి.

PREV
click me!

Recommended Stories

Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?
దళపతి విజయ్ టీమ్‌కు మలేషియా పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, ఎందుకంటే?