Akhil Agent Shooting: సిక్స్ ప్యాక్ తో సెట్స్ మీదకు వెళ్లబోతున్న అఖిల్... ఈసాకి కంప్లీట్ చేసేస్తాడట.

Published : Feb 10, 2022, 03:23 PM ISTUpdated : Feb 10, 2022, 03:25 PM IST
Akhil Agent Shooting: సిక్స్ ప్యాక్ తో సెట్స్ మీదకు వెళ్లబోతున్న అఖిల్... ఈసాకి కంప్లీట్ చేసేస్తాడట.

సారాంశం

వరుసగా హ్యాట్రీక్ ఫెయిల్యూన్స్ తో బాధపడుతున్న అక్కినేని కుర్ర హీరో అఖిల్ (Akhil) ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకున్నాడు. మొన్నటి వరకూ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసిన యంగ్ స్టార్ అదే ఊపును కంటీన్యూ చేయాలని చూస్తున్నాడు.

వరుసగా హ్యాట్రీక్ ఫెయిల్యూన్స్ తో బాధపడుతున్న అక్కినేని కుర్ర హీరో అఖిల్ (Akhil) ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకున్నాడు. మొన్నటి వరకూ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసిన యంగ్ స్టార్ అదే ఊపును కంటీన్యూ చేయాలని చూస్తున్నాడు.

కెరియర్ బిగినింగ్ నుంచి పెద్ద సినిమాలే చేసుకుంటూ వస్తున్నాడు అఖిల్(Akhil)  అక్కినేని. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నా... తనకు ఏమాత్రం కలిసి రాలేదు. మొదలెట్టిన దగ్గర నుంచి వరుసగా మూడు సినిమాలు పెవీలియన్ చేరాయి. దాంతో నాలుగో సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  ను సెలక్ట్ చేసుకున్నాడు అఖిల్. ఈసినిమాతో భారీ హిట్ కాకపోయినా.. మోస్తర్ సక్సెస్ ను సాధించాడు.

అదే ఉత్సాహంతో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖల్. ఈమూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. అయితే ఏజంట్ సినిమాతో ఓ చిక్కు వచ్చి పడింది. ఈ సినిమా స్టోరీ పరంగా ఎక్కువగా ఫారెన్ లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే కారోనా వల్ల అది కుదరలేదు. షూటింగ్ స్టార్ట్ చేసినా.. ఎక్కువగా బ్రేక్స్ ఇవ్వవలిస వచ్చింది.

చాలా వరకూ కంప్లీట్ అయిన ఈమూవీ షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ ను ఈనెల 15 నుంచి స్టార్ట్ చేసుకోవాలి అని చూస్తున్నారు. హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను. దీనికి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఏజంట్ సినిమాను సుంకర రాంబ్రహ్మం నిర్మిస్తున్నారు.

ఈసారి ఎలాగైనా షూటింగ్ కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు అఖిల్. ఏజంట్ సినిమాకోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ చేయడమే కాదు బాడీని కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నాడు. గతంలో అఖిల్ కు ఏజంట్ అఖిల్ కి చాలా తేడా ఉంది అని అనిపంచుకునేంతగా మారిపోయాడు యంగ్ హీరో. ఈ మూవీలో రా ఏంజట్ గా కనిపించబోతున్నాడు అక్కినేని హీరో.

 ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను మలయాళ స్టార్ హీరో  మమ్ముట్టి పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ బోతున్నట్టు సమాచారంజ. ఇక ఈమూవీలో అఖిల్ జోడీగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. ఏజంట్ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈనెల 15న తదుపరి షెడ్యూల్ ను స్టార్ట్ చేసి.. త్వరలోనే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?