దిల్ రాజు కొన్న తమిళ్ కథ.. బన్నీకి కావాలట?

By Prashanth MFirst Published Nov 19, 2018, 9:06 PM IST
Highlights

ఒక భాషలో మంచి సినిమా వచ్చింది అంటే చాలు వాటి హక్కులను దక్కించుకోవడానికి ఇతర బాషల నిర్మాతలు చాలా ఆసక్తిని చూపుతున్నారు. అర్జున్ రెడ్డి - ఆర్ఎక్స్ 100 చిత్రాలే అందుకు ఉదాహరణ. 

ఒక భాషలో మంచి సినిమా వచ్చింది అంటే చాలు వాటి హక్కులను దక్కించుకోవడానికి ఇతర బాషల నిర్మాతలు చాలా ఆసక్తిని చూపుతున్నారు. అర్జున్ రెడ్డి - ఆర్ఎక్స్ 100 చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇక తమిళ్ సినిమాలపై కూడా అప్పుడపుడు మన నిర్మాతలు దక్కించుకుంటూ ఉంటారు. 

అదే తరహాలో కోలీవుడ్ లో కాసుల వర్షం కురిపించిన 96 కథను దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి - త్రిష నటించిన ఈ సినిమా అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ 38 ఏళ్ల వ్యక్తిగా ఉంటుంది. అయితే తెలుగులో నాని బన్నీకి స్పెషల్ షో వేసి మరో ఆలోచించుకొమన్న దిల్ రాజు ఇప్పుడు కథను అమ్మే పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

నానికి ఏ మాత్రం సెట్ కాదని సన్నహితులు చెప్పారట. ఇక బన్నీకి స్టార్ ఇమేజ్ దృష్ట్యా అంత రిస్క్ చేయలేడు. విజయ్ సేతుపతి ఏ క్యారెక్టర్ ఇచ్చిన అలవోకగా చేసే స్టామినా ఉంది,. యాక్సెప్ట్ చేసే ఆడియెన్స్ కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ వర్కౌట్ అయ్యింది. కానీ ఇక్కడ స్టార్ హీరోలు చేయడమంటే రిస్క్ అని చెప్పవచ్చు. అయితే బన్నీ ఈ కథను బాగా లైక్ చేసినట్లు సమాచారం. 

త్వరలోనే సొంతంగా సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్న ఆలోచనలో ఉన్న బన్నీ మొదట ఇలాంటి డిఫరెంట్ సినిమాతో ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేసి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అయితే దిల్ రాజు బన్నీకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. బన్నీ మాత్రం ఇందులో నటించే అవకాశాలు మాత్రం లేవని చెప్పవచ్చు. వేరే ఎవరితో అయినా ట్రై చేద్దామని ఆలోచిస్తున్నట్లు టాక్. మరి 96 తెలుగు కథలో ఎవరు కనిపిస్తారో చూడాలి.

click me!