ఇరవైఏళ్ల తర్వాత స్టయిలీష్‌ స్టార్‌ అజిత్‌ భార్య, నటి షాలిని రీఎంట్రీ ?

Published : Feb 13, 2021, 07:56 AM IST
ఇరవైఏళ్ల తర్వాత  స్టయిలీష్‌ స్టార్‌ అజిత్‌ భార్య, నటి షాలిని రీఎంట్రీ ?

సారాంశం

బాల నటిగా, హీరోయిన్‌గా చేసి ఆకట్టుకున్న షాలిని మాధవన్‌, అజిత్‌, విజయ్‌ లతో కలిసి నటించింది. ఈ క్రమంలో అజిత్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. 2000లో అజిత్‌తో మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు షాలిని. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. 

బాలనటిగా పాపులర్‌ అయిన షాలిని ఆ తర్వాత హీరోయిన్‌గా తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించింది. మాధవన్‌, అజిత్‌, విజయ్‌ లతో కలిసి నటించింది. ఈ క్రమంలో అజిత్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. 2000లో అజిత్‌తో మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు షాలిని. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. 

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత షాలిని రీఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. మణిరత్నం ప్రస్తుతం `పొన్నియిన్‌ సెల్వన్‌` అనే పేరుతో హిస్టారికల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో గెస్ట్ రోల్‌లో షాలిని నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ నెలాఖరులో షాలిని ఈ షూటింగ్‌లో పాల్గొంటారని టాక్‌. 

ఇందులో విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో షాలిని ఓ కామెడీ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే ఐశ్వర్యరాయ్‌, కార్తి, జయంరవి, త్రిషలు షూటింగ్‌లో పాల్గొన్నారు. రెండు పార్ట్ లుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఓ పార్ట్ ని ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు. కాగా షాలిని చివరగా 2001లో తమిళ చిత్రం `పిరియాధ వరం వెండం` చిత్రంలో ప్రశాంత్‌కి జోడీగా నటించింది. ఆ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. మాధవన్‌తో చేసిన `అలైపయుథే` చిత్రం తెలుగులో `సఖి`గా డబ్‌ అయిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు