శంకర్-చరణ్ మూవీ పై మెగాస్టార్ కామెంట్!

Published : Feb 12, 2021, 09:21 PM IST
శంకర్-చరణ్ మూవీ పై మెగాస్టార్ కామెంట్!

సారాంశం

రామ్ చరణ్ 15వ చిత్రం దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ భారీ ప్రాజెక్ట్ పై చిరంజీవి సైతం స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా శంకర్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై తన స్పందన తెలియజేశారు. 

ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న అతి పెద్ద ప్రాజెక్ట్స్ లో ఒకటిగా శంకర్, చరణ్ మూవీ నిలవనుంది. నిర్మాత దిల్ రాజు తన 50వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. రామ్ చరణ్ 15వ చిత్రం దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ప్రకటన మెగా ఫ్యాన్స్ లో అంతులేని ఆనందం నింపింది. దర్శకుడు శంకర్, రామ్ చరణ్ మరియు నిర్మాత దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందం తెలియజేశారు. 

ఈ భారీ ప్రాజెక్ట్ పై చిరంజీవి సైతం స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా శంకర్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై తన స్పందన తెలియజేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ అనగానే థ్రిల్ అయ్యానని ఆయన అన్నారు. అత్యద్భుతమైన టాలెంట్ తో భారతీయ చిత్రాన్ని ప్రపంచ పటంలో నిలిపిన శంకర్ వంటి దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేయడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు.

గొప్ప గొప్ప దర్శకులతో వరుసగా చిత్రాలు చేస్తున్న చరణ్ కి బెస్ట్ విషెష్ అని ఆయన తెలపడం జరిగింది. నిజంగా శంకర్ తో మూవీ చేయడం చాలా మంది హీరోలకు కలగా ఉంటుంది. కెరీర్ బిగినింగ్ నుండి శంకర్ తెరకెక్కించిన చిత్రాలు అద్భుతాలు చేశాయి. శంకర్ మొదటిసారి ఇతర పరిశ్రమకు చెందిన హీరోతో మూవీ చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: డైరెక్టర్ తో ఈషా రెబ్బా రిలేషన్ షిప్, త్వరలో పెళ్లి.. ఒకరిని చూస్తున్నా అంటూ కంఫర్మ్ చేసిన నటి
తనతో నటించిన హీరోయిన్లలో హీరో నానికి ఫేవరెట్ ఎవరో తెలుసా.?