
సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన చేతుల మీదుగా విడుదలైంది... చిత్తం మహారాణి సినిమాలోని కోలకళ్ళ చిన్నది పాట. ఈ సాంగ్ ఇప్పుడు భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.
లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా చిత్తం మహారాణి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కోలకళ్ళ చిన్నది లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన ఈ పాటను రిలీజ్ చేశారు.
ఈ పాటను ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు మూవీ టీమ్.
Also Read : రెండు జంటల మధ్య బిగ్ బాస్ చిచ్చు.. బ్రేకప్ బాటలో శ్రీహాన్ – సిరి..?