Valimai OTT Date: అజిత్‌ `వలిమై` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. టార్గెట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`?

Published : Feb 25, 2022, 08:29 PM IST
Valimai OTT Date: అజిత్‌ `వలిమై` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. టార్గెట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`?

సారాంశం

అజిత్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ `వలిమై` చిత్రం ఫస్ట్ డే భారీ వసూళ్లని రాబట్టింది. తమిళనాట ఇది అజిత్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఓటీటీ డేట్‌ కూడా ఫిక్సయ్యిందట. 

తమిళ స్టార్‌ హీరో అజిత్‌(Ajith) నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ `వలిమై`(Valimai) గురువారం విడుదలై థియేటర్ లో రన్‌ అవుతుంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. అయితే హీరో అజిత్‌, విలన్‌గా నటించిన తెలుగు హీరో కార్తికేయ మధ్య డ్రామా, కాన్‌ఫ్లిక్ట్ సన్నివేశాలు మిస్‌ అయ్యాయనే టాక్‌ వినిపిస్తుంది. అయితే యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చుతుందంటున్నారు.

ఈ సినిమా ఫస్ట్ డే పరంగా భారీ కలెక్షన్లని రాబట్టింది. ఇది కేవలం తమిళనాడులోనే ఫస్డ్ డే రోజు 34కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇది అజిత్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు తొంబై కోట్లకుపైగా కలెక్షన్ల గ్రాన్‌ని రాబట్టిందంటున్నారు. తెలుగులో `భీమ్లానాయక్‌` రిలీజ్‌ కావడంతో ఇది అజిత్‌ `వలిమై` చిత్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది. పైగా `భీమ్లా నాయక్‌`కి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. థియేటర్‌లో పవన్‌ విజృంభించారని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో `వలిమై` థియేటర్లు రేపటి నుంచి ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. దీంతో `వలిమై` కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. 

మరోవైపు హిందీలో అలియాభట్‌ నటించిన `గంగూబాయి` చిత్రానికి కూడా పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. దీంతో అక్కడ కూడా `వలిమై` చిత్రంపై ప్రభావం పడబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా `వలిమై` ఓటీటీ డేట్‌ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం మార్చి 25న ఓటీటీలో విడుదల కాబోతుందని సమాచారం. ఈ చిత్ర డిజిటల్‌ రైట్స్ ని జీ స్టూడియోస్‌ దక్కించుకుంది. దాదాపు డెబ్బై కోట్లకు `వలిమై` ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్టు టాక్‌. తెలుగులో ఇది `జీ 5`లో స్ట్రీమింగ్‌ అవుతుందని సమాచారం. 

ఇదిలా ఉంటే కరెక్ట్ గా పాన్‌ ఇండియా చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌` రిలీజ్‌ అవుతున్న రోజే అజిత్‌ `వలిమై`ని ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయబోతుండటం విశేషం. ఇది తమిళనాట `ఆర్‌ఆర్‌ఆర్‌`థియేటర్‌ కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలి. ఇక అజిత్‌ హీరోగా, హ్యూమా ఖురేషి కథానాయికగా, కార్తికేయ విలన్‌గా నటించిన `వలిమై` చిత్రానికి హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్‌ నిర్మించారు. ఈ నెల 24(గురువారం) ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీలో విడుదలైన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం