Mahesh Manjrekar Case : పిల్లలతో అసభ్యకర సన్నివేశాల ఆరోపణపై ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ పై కేసు నమోదు..

Published : Feb 25, 2022, 06:26 PM IST
Mahesh Manjrekar Case : పిల్లలతో అసభ్యకర సన్నివేశాల ఆరోపణపై ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ పై కేసు నమోదు..

సారాంశం

బాలీవుడ్ నటుడు, ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ పై తాజాగా కేసు నమోదైంది. ఈయన దర్శకత్వం వహించిన మరాఠీ ఫిల్మ్ లో పిల్లలతో అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించారనే ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది.   

బాలీవుడ్ నటుడు, ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.  పిల్లలతో  అసభ్యకర సన్నివేశాలను చిత్రీకరించిన నేపథ్యంలో మహేశ్ పై ముంబై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఓ మరాఠీ చిత్రంలో మైనర్‌ పిల్లలతో అసభ్యకర సన్నివేశాలు చూపించారనే ఆరోపణలపై నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌పై ముంబైలోని మహిమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదైనట్టుగా నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు.  

అంతకుముందు, ముంబైలోని సెషన్స్ కోర్టు మరాఠీ చిత్రంలో ఆరోపించిన అసభ్యకర సన్నివేశాలపై సామాజిక కార్యకర్త సీమా దేశ్‌పాండే పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అందిన పిటిషన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. పిల్లలతో అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని భావిస్తున్నారు. సీమా దేశ్‌పాండే తరపు న్యాయవాది ప్రకాశ్ సల్సింగికర్ మాట్లాడుతూ, సెక్షన్ 153 (3) ప్రకారం దర్యాప్తు చేయాలని సీఆర్‌పీసీని కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారు. ఇంకా మహేశ్ ను మాత్రం అరెస్ట్ చేయడం, మరే ఇతర చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగనుంది. 

 

బాలీవుడ్ లో నటుడిగా, ఫిల్మ్ డైరెక్టర్ మంచి గుర్తింపు ఉన్న ఈయన తెలుగు చిత్రాల్లోనూ నటించారు. తొలుత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన ‘అదుర్స్ ’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘డాన్ శీను’, ‘అఖిల్’, ‘గుంటూరు టాకీస్’ చివరిగా మెగా పవర్  స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించారు. పలు విలన్స్ రోల్స్ చేసి ఆడియెన్స్ అలరించారు. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా