One Year of RRR : ఏడాదిలో ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఘనతలు ఎన్నో.. చరిత్ర సృష్టించిన జక్కన్న

By Asianet News  |  First Published Mar 25, 2023, 11:26 AM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చెరగని ముద్ర వేసిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై నేటికీ ఏడాది పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా ఏడాదిలో ఆర్ఆర్ఆర్ సాధించిన ఘనతలను టీమ్ గుర్తు చేసింది. ప్రేక్షకుల ప్రేమకూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 
 


దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై నేటికీ సరిగ్గా ఏడాది పూర్తైంది. ఏడాదిలో ఎన్నో ఘనతలను సాధించిన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. సౌత్, నార్త్ కాకుండా.. అంతర్జాతీయంగా అవార్డులను అందుకొని  ఇండియన్ సినిమా సత్తాను చాటింది. ఇండియన్ ప్రేక్షకులనే కాకుండా విదేశీయులనూ తెలుగు సినిమాకు అభిమానులుగా మార్చుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా RRR కాసుల వర్షం కురిపించి రికార్డు క్రియేట్ చేసింది.

మార్చి 25, 2022న ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మాసీవ్ థియేటర్లలో రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చిత్రంలో యాక్షన్ సీన్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషన్స్, డ్రామ, రామ్, భీమ్ క్యారెక్టరైజేషన్స్, నాటు నాటు సాంగ్, కొరియోగ్రఫీకి ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమాకు క్రేజ్ దక్కింది. 

Latest Videos

undefined

బాక్సాఫీస్ వద్ద వ ’ఆర్ఆర్ఆర్‘ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మొదటిరోజు రూ.220 కోట్లకు పైగా కలెక్షన్లు రాబ్టటి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక లాంగ్ రన్ లో రూ.1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హ్యయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో నాలుగో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అదీగాక జపాన్, యునైడెట్ స్టేట్స్ లోని థియేటర్లలో చాలా రోజులు ప్రదర్శించబడిన ఇండియన్ ఫిల్మ్ గానూ చరిత్ర సృష్టించింది. అదీగాక ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శించబడి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంది. హాలీవుడ్  దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు ప్రత్యేకంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అభినందించడం చాల గొప్ప విషయం.  

ఇక అవార్డుల పంటలోనూ ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు కేటగీరీల్లో 83 నామినేషన్లలో నిలిచింది. అందులో 35 అవార్డులను సొంతం చేసుకుంది. వాటిలో మార్చి 13న అమెరికాలో జరిగిన 95వ ఆస్కార్స్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ ప్రత్యేకతను సంతరించుకుంది. ‘నాటు నాటు’కు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ వేదికపై ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. దీంతో ఇండియన్స్ సంతోషంతో గర్వించారు. అంతకముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ను అందుకుని చరిత్ర సృష్టించింది. అదీగాక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ చాయిస్, క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, పండోరా ఫిల్మ్ ఇంటర్నేషనల్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఆయా విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. అదీగాక మరిన్నీ అవార్డులను కూడా అందుకుని మునుపెన్నడూ లేని రికార్డును క్రియేట్ చేసింది. హాలీవుడ్ సర్కిల్స్ లో ఇండియన్ సినిమాను ప్రత్యేక గౌరవం వచ్చేలా చేసింది. ముఖ్యంగా జక్కన్నఅండ్ టీమ్ తెలుగు చిత్రానికి అంతర్జాతీయ క్రేజ్ సాధించేందుకు ఎంతగాకృషి చేసి ఫలించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  

చిత్రం రిలీజ్ అయి ఏడాది అయినా ఇంకా ఆయా దేశాల్లో, ఇండియాతో పాటుగా ఏమాత్రం క్రేజ్ దక్కలేదు. ఆస్కార్ అందుకున్న తర్వాత మరింత ట్రెండ్ అవుతూనే ఉంది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు, తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కినందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఏడాది అయినా ప్రపంచంలో ఎక్కడోచోట రన్ అవుతూనే ఉందంటూ.. ఇంతలా ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజతలు తెలిపారు. 

It’s been a year since was released and it is still running in theatres somewhere in the world, getting housefuls.

This feeling is bigger than any award, and we cannot thank you all enough for all the love you have showered throughout. ❤️ pic.twitter.com/hLglDr774F

— RRR Movie (@RRRMovie)
click me!