యాడ్ షూట్ లో సహనం కోల్పోయిన RRR స్టార్.. పారిపోతాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

Mahesh Jujjuri   | Asianet News
Published : Feb 15, 2022, 09:26 AM IST
యాడ్ షూట్ లో సహనం కోల్పోయిన RRR స్టార్.. పారిపోతాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

సారాంశం

సెలెబ్రిటీలు కార్పొరేట్ సంస్థలు ప్రచారం కల్పించడం సహజమే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రస్తుతం కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా గ్రూప్ కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. 

కార్పొరేట్ సంస్థల పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. పేరుమోసిన స్టార్ సెలెబ్రిటీలు కార్పొరేట్ సంస్థలు ప్రచారం కల్పించడం సహజమే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రస్తుతం కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా గ్రూప్ కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. 

మహీంద్రా సంస్థ తమ ట్రక్స్, బస్ ల కోసం అజయ్ దేవగన్ పై ఓ యాడ్ షూట్ చేస్తోంది. దీని అప్డేట్ ని మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ఫన్నీగా సోషల్ మీడియాలో ఇచ్చారు. అజయ్ దేవగన్ యాడ్ షూట్ లో ఉన్న లొకేషన్ వీడియో షేర్ చేశారు. 

ఈ వీడియోలో అజయ్ దేవగన్ యాడ్ షూట్ టీమ్ ని విసుగుతో ప్రశ్నించారు. ఎన్ని సార్లు స్క్రిప్ట్ మారుస్తారు అంటూ అజయ్ అసహనంతో అడగడం చూడొచ్చు. దీనిని మహీంద్రా సంస్థ పూర్తిగా పబ్లిసిటీ స్టంట్ గా మార్చేసింది. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. యాడ్ షూట్ లో అజయ్ దేవగన్ సహనం కోల్పోయారని నాకు సమాచారం అందింది. 

మా ట్రక్ లో అజయ్ దేవగన్ నాపై కోపంతో రాకముందే నేను టౌన్ విడిచి పారిపోతాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియోలో త్వరలో మరిన్ని సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి అని తెలిపారు. 

ఏది ఏమైనా స్టార్ హీరోలకు యాడ్ షూట్ లు కొత్తేమి కాదు. తక్కువ సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ యాడ్ షూట్స్ ద్వారా సెలెబ్రిటీలు పొందుతుంటారు. గతంలో అజయ్ దేవగన్ పాన్ మాసాలకి ప్రచార కర్తగా వ్యవహరించి విమర్శలు ఎదుర్కొన్నారు. 

ఇదిలా ఉండగా అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు. అజయ్ రోల్ ఏంటనేది ఇంతవరకు రాజమౌళి క్లూ ఇవ్వలేదు. సో రిలీజ్ వరకు వైట్ చేయాల్సిందే. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ