Taapsee : తాప్సి ముద్దు పెడుతుంటే చీప్ కామెంట్స్ చేసిన డైరెక్టర్.. ఇంత అసభ్యంగానా..

Mahesh Jujjuri   | Asianet News
Published : Feb 15, 2022, 08:58 AM IST
Taapsee : తాప్సి ముద్దు పెడుతుంటే చీప్ కామెంట్స్ చేసిన డైరెక్టర్.. ఇంత అసభ్యంగానా..

సారాంశం

కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. 

సొట్ట బుగ్గల సుందరి తాప్సి 2010లో తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. 

తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే బోల్డ్ సీన్స్, ముద్దు సన్నివేశాల్లో కూడా తాప్సి నటిస్తోంది. తాప్సి నటించిన చిత్రాలు ఎక్కువగా ఓటిటి వేదికల్లో రాణిస్తున్నాయి. తాప్సి రీసెంట్ గా నటించిన చిత్రం 'లూప్ లపేట'. ఇది 1998లో తెరకెక్కిన జర్మన్ మూవీ 'రన్ లోలా రన్' అనే చిత్రానికి రీమేక్. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తాప్సి ఓ చేదు అనుభవం ఎదుర్కొంది. 

ఈ విషయాన్ని తాప్సి తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఈ మూవీలో తాప్సి, నటుడు తాహిర్ మధ్య రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో దర్శకుడు ఆకాష్ భాటియా తన అసభ్యకరమైన కామెంట్స్ తో చిరాకు పుట్టించారని తాప్సి పేర్కొంది. 

తమని ముద్దు సన్నివేశం పూర్తి చేయనీయకుండా ఆకాష్ కామెంట్రీ తరహాలో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను, తాహిర్ ముద్దు సన్నివేశం మొదలు పెట్టాం. దీనితో ఆకాష్.. ఓకే.. మొదలు పెట్టండి, నైస్ గా మాట్లాడుకోండి.. మీ చేతులని ఒకరినొకరు హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ముద్దు పెట్టుకోండి. ఆ ముద్దు ఎలా ఉండాలంటే ఒకరికొకరు స్విచ్ ఆన్ చేసినట్లుగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ కామెంట్స్ పట్టించుకోకుండా మేమిద్దరం కిస్ సీన్ లో నటిస్తున్నాం. 

కానీ మధ్యలో ఆకాష్ కామెంట్స్ శృతి మించాయి. ముద్దు సీన్ మధ్యలో ఉండగా.. తాహిర్ ఇలాంటి అమ్మాయిని ఇంతకు ముందెప్పుడూ నువ్వు చూడలేదు. ఇలాంటి అమ్మాయితో ఇలాంటి ఛాన్స్ ఎప్పుడూ నీకు దక్కలేదు.. కిస్ చెయ్' అంటూ అసభ్యంగా మాట్లాడాడు. నాకు చిరాకు వేసింది. వెంటనే కిస్సింగ్ సీన్ ని మధ్యలోనే ఆపేశాను. నేను తాహిర్ వంక చూస్తూ .. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు ? అని ప్రశ్నించాను. ఆయన కామెంట్స్ చాలా డిస్ట్రబ్ గా ఉన్నాయి అని చెప్పినట్లు తాప్సి పేర్కొంది. 

ఆ తర్వాత మళ్ళీ ఆ కిస్ సీన్ ని పూర్తి చేసినట్లు తాప్సి పేర్కొంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన లూప్ లపేట చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఒరిజినల్ మూవీ రన్ లోలా రన్ లో నటించిన నటి ఫ్రాంకా కూడా సోషల్ మీడియా వేదికగా తాప్సికి శుభాకాంక్షలు తెలిపారు. తమ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు