ఆ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయకండి.. స్టార్ హీరోకి అభిమాని రిక్వెస్ట్!

Published : May 06, 2019, 12:21 PM IST
ఆ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయకండి.. స్టార్ హీరోకి అభిమాని రిక్వెస్ట్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కి ఓ అభిమాని చేసిన విన్నపం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కి ఓ అభిమాని చేసిన విన్నపం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ కి చెందిన నానక్ రామ్ అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అతడికి ఇద్దరు పిల్లలు నలభై ఏళ్ల వయసు గల నానక్ రామ్.. అజయ్ దేవగన్ కి అభిమాని.గతంలో అజయ్ దేవగన్ పొగాకు ప్రొడక్ట్ కి సంబంధించి ఓ యాడ్ లో నటించాడు. అజయ్ ఏ ఉత్పత్తినైతే బ్రాండింగ్ చేశాడో దాన్నే నానక్ రామ్ వాడాడు. దానికి అడిక్ట్ అవ్వడం వలన అతడికి నోటి క్యాన్సర్ వచ్చింది. 

దీంతో ఆ అభిమాని ఇప్పుడు పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించొద్దు అంటూ అజయ్ దేవగన్ కి విన్నవించుకుంటున్నాడు. అజయ్ దేవగన్ కి తన బాధను, జరిగిన నష్టాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా నానక్ రామ్ కుటుంబ సభ్యులు వెయ్యి కరపత్రాలను ముద్రించి సంగనేర్, జగత్ పురా ప్రాంతాల్లోని గోడలకు అంటించారు. మద్యం, సిగరెట్, పొగాకు.. శరీరానికి చాలా హానికరమని వాటిని నటులేవ్వరూ ప్రమోట్ చేయొద్దని కరపత్రంలో నానక్ రామ్ కోరారు.

దీనిపై నానక్ రామ్ తనయుడు దినేష్ స్పందిస్తూ.. ''అజయ్ దేవగన్ నటించినే బ్రాండ్ పొగాకునే మా నాన్న కొన్నేళ్లుగా వాడుతున్నారు. దాని కారణంగానే ఆయనకు క్యాన్సర్  వచ్చింది. అంత పెద్ద నటుడు ఇలాంటి పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయకూడదని మా నాన్న భావించారు. అందుకే మా వంతు ప్రయత్నంగా పొగాకు ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయొద్దని అజయ్ దేవగన్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. మరి దీనిపై అజయ్ దేవగన్ ఎలా స్పందిస్తారో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్