
సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నాయి. రికార్డ్ ల మీద రికార్డులను తిరగరాస్తున్నాయి. బాలీవుడ్ చిన్నోయేలా మన సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్-2 లాంటి సినిమాలు ఎంత సత్తా చాటాయో చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాకు చాలా అవమానాలు జరిగాయి. ఇక ఇప్పుడు సౌత్ సినిమాలు స్థాయి పెరిగే సరికి మన స్టార్స్ కూడా ధీటుగా సమాధానాలు చెపుతున్నారు.
ఇక ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కెజియఫ్-2 మూవీపై మాట్లాడుతూ.. ఆ సినిమున ను పొగడర్తలతో ముంచెత్తారు. కెజియఫ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదన్నాడు. సుదీప్ మాటలకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా దీటుగా బదులిచ్చాడు.
సుదీప్‌కు కౌంటర్ ఇస్తూ అజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నా సోదరుడా..కిచ్చా సుదీప్..హిందీ జాతీయ భాష కాదని నువ్వు అంటున్నావు మరి సినిమాను నీ ప్రాంతీయ భాషలో విడుదల చేయకుండా ఎందుకు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నావు..? ఇప్పుడు, ఎప్పుడు హిందీ మాతృ భాష, జాతీయ భాష అని అజయ్ దేవగణ్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ట్వీట్‌కు సుదీప్ రిప్లై ఇచ్చాడు. నేను వేరే సందర్భంలో ఈ మాటలను చెప్పాను. మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసినప్పుడు ఆ మాటలను ఎందుకు అన్నానో నేను వివరంగా చెపుతాను, ఎవరినీ బాధపెట్టాలని, రెచ్చగొట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు. దేశంలోని ప్రతి భాష మీద నాకు గౌరవం ఉంది. ఈ టాపిక్ ఇక్కడితే ముగిసిపోతే బాగుంటుంది అన్నారు.
అంతే కాదు త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థమైంది అన్నారు సుధీప్. నాకు హిందీ మీద ప్రేమ, గౌరవం ఉంది కాబట్టే నేర్చుకున్నాను. కానీ, కన్నడలో నేను రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటీ అని ఆలోచిస్తున్నాను అని కిచ్చా సుదీప్ ట్విట్టర్‌లో తెలియకుండానే చురక అంటించారు. ఇక కాసేపటికే అజయ్ దేవగణ్ ట్విట్టర్‌లో మరో పోస్ట్ పెట్టాడు.
సుదీప్ నువ్వు నా స్నేహితుడివి. అపార్థాన్ని విడమరిచి చెప్పినందుకు ధన్యవాదాలు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే అని నేను భావిస్తాను. మేం అన్ని భాషలను గౌరవిస్తాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అన్ని భాషలను గౌరవించాలని కోరుకుంటాం అని అజయ్ మరోసారి ట్వీట్ చేశాడు.
ఇక ట్విట్టర్ లో ఈ లాంగ్వేజ్ వార్ ఎక్కడి వరూ వెళ్తుందో అని నెటిజన్లతో పాటు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. గత వారంలో ఓ ఈవెంట్ కు వెళ్లిన కన్నడ హీరో సుదీప్ హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదు. ఈ రోజు మనం తెరకెక్కిస్తున్న చిత్రాలను ప్రపంచం మొత్తం చూస్తుంది అని కామెంట్స్ చేశాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది వార్.