`తెలంగాణ రియల్‌ టైగర్‌ రేవంత్‌ రెడ్డి`.. వర్మ పోస్ట్ వైరల్‌..

Published : Apr 27, 2022, 09:14 PM IST
`తెలంగాణ రియల్‌ టైగర్‌ రేవంత్‌ రెడ్డి`.. వర్మ పోస్ట్ వైరల్‌..

సారాంశం

రామ్‌గోపాల్‌ వర్మ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి దిగిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వర్మ పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది.

వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) ఏం మాట్లాడినా అది సంచలనమే. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటారు. ఊహించని పోస్ట్ లతో, ఊహించని కామెంట్లతో ఆయన పరిస్థితులను మరింత ఆసక్తికరంగా మారుస్తుంటారు. చర్చనీయాంశం చేస్తారు. తాజాగా RGV తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో కలిసి దిగిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అంతేకాదు ఇందులో `తెలంగాణలోని రియల్‌ టైగర్‌` అంటూ పోస్ట్ పెట్టారు. ఇది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. వైరల్‌ అవుతుంది.

అయితే దీనికి కొండా సురేఖ స్పందించింది. వర్మ పోస్ట్ ని ఉద్దేశించి ఆమె రియాక్ట్ అవుతూ, `ఇద్దరు విభిన్న ప్రజాదరణ పొందిన వ్యక్తులు కలిసి తెలంగాణలో అపరిమితమైన శక్తిగా మారగలరు` అని ట్వీట్‌ చేసింది. వర్మని ట్యాగ్‌ చేసింది. దీనికి ఆర్జీవీ స్పందించారు. అందుకు కేవలం ఒక్క రేవంత్‌రెడ్డి చాలు అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. ఓ వైపు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లీనరీ జరుగుతున్న సమయంలో వర్మ.. ఇలా రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించడం ఆద్యంతం చర్చనీయాంశంగా మారింది. 

అయితే గతంలోనూ ఓ సందర్భంలో రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనూ రియాక్ట్ అయ్యారు. అప్పట్లో కూడా రేవంత్‌రెడ్డిని టైగర్‌గా అభివర్ణించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఆయన్ని కలిసిన సందర్భంగా ఇలాంటి పోస్ట్ పెట్టడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో, టీఆర్‌ఎస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వర్మ.. రేవంత్‌రెడ్డితో కలిసి ఫోటో దిగడం, దాన్ని పోస్ట్ చేస్తూ ఆయన్ని తెలంగాణ టైగర్‌గా వర్ణించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం కొండా సురేఖ, కొండా మురళీ జీవిత కథలతో `కొండా` చిత్రాన్ని రూపొందించారు. త్రిగుణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు వర్మ ఇటీవల ఉపేంద్రతో `ఆర్‌ః ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్‌స్టర్‌ ఎవర్‌` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?