RRR: దేవ్ గన్.. దేశం కోసమే..!

Published : Mar 18, 2019, 02:56 PM IST
RRR: దేవ్ గన్.. దేశం కోసమే..!

సారాంశం

RRRపై నెలకొన్న చాలా సందేహాలకు చివరకు చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు రాజమౌళి సినిమాలో అజయ్ దేవ్ గన్ ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం మరో పాత్ర కూడా హీరోలతో సమానంగా ఉండాలట. ఓ విధంగా నార్త్ ఆడియెన్స్ ని కూడా ఆకర్షించాలి కాబట్టి చిన్న ట్రిక్ అనుకున్న తప్పులేదు. 

అయితే రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో.. తారక్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక అజయ్ దేవగన్ కూడా నార్త్ ఇండియాకు చెందిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ లోనే దర్శనమిస్తాడట. గెస్ట్ రోల్ అయినప్పటికీ కథానాయకులతో సమానంగా ఉండే రోల్ అని సమాచారం 

కొమురం భీమ్..  అల్లూరి సీతారామరాజు పాత్రల మాదిరిగానే.. నార్త్ స్టేట్ కి చెందిన ఒక నిజమైన ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ ఆధారంగా దర్శకుడు పాత్రను డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశం కోసం ముగ్గురు ఎలా ఒకటయ్యారు అనేదే అసలు కథాంశం. అందుకే అజయ్ పాత్ర నిడివి తక్కువే అయినా క్షణం ఆలోచించకుండా రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆలియా భట్ సినిమాలో అల్లూరి మరదలుగా సీత పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.   

PREV
click me!

Recommended Stories

Jailer 2 Collection Day 1: జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ, ఫస్ట్ డే సెంచరీ కొట్టిన రజనీకాంత్, రికార్డుల వేట.. 1000 కోట్లు పక్కా..
Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్‌ సినిమా ఎలా ఉందంటే?