అనీల్ రావిపూడి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటంటే..?

Published : Mar 18, 2019, 02:42 PM IST
అనీల్ రావిపూడి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటంటే..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. 

సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. 'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' అంటూ వరుస విజయాలు అందుకున్న అనీల్ రావిపూడి ఇటీవల 'ఎఫ్ 2'తో మరో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా కారణంగా మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈరోజు నుండి స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయి 'మహర్షి' సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ పోలీస్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాలో మహేష్ ఓ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. కొన్ని రోజుల సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఓ మిలిటరీ ఆఫీసర్ చుట్టూ సరదాగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారట.

కథ ప్రకారం సినిమాలో వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని సమాచారం. చాలా కాలం తరువాత మళ్లీ మహేష్ బాబులో కామెడీ యాంగిల్ ని ఈ సినిమా మొత్తం చూపించబోతున్నారన్నమాట. 

PREV
click me!

Recommended Stories

సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్