
ప్రస్తుతం ఇండియాన్ సినిమా చూపంతా ఒక సినిమావైపే ఉంది. అదే సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ మీద. ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ ల్ స్పీడ్ పెంచేస్తున్నారు టీమ్. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా మోదటి భాగాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈసినిమాలో ఇండియన్ లెజెంట్ యాక్టర్స్ నటిస్తున్నారు. తమిళసినిమా సత్తాని ప్రపంచానికి చాటాలన్న ఆలోచనతో మణిరత్నం ఈసినిమాను డ్రీమ్ ప్రాజెక్ట్ గా చేపట్టారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్ ఆడియో, ట్రైలర్ లాంఛ్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో తమిళ సినీ పరిశ్రమ అంతా పాల్గోంది.
ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో త్రిష, ఐశ్వర్య రాయ్ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈవెంట్‌లో లీడ్ యాక్టర్లు సంప్రదాయక, సినిమా థీమ్ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇపుడు ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్న ఐశ్వర్యారాయ్, త్రిష దిగిన సెల్ఫీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సినిమా షూటింగ్ లొకేషన్‌లో మానిటర్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకున్న స్టిల్ ట్రెండింగ్ అవుతోంది. ట్రెడిషినల్ లుక్ లో ఈ ఇద్దరు స్టార్లు అదరగొట్టేశారు. వీరిని ఇలా చూసిన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నాను.
ఇక ఈ సినిమాలో ఈ ఇద్దరు పాత్రలకు సంబంధించి చాలా ట్విస్టులు ఉంటాయట. మణిరత్నం వీరి పాత్రలను డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సెల్ఫీలో... ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఒకే ఫ్రేములో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ పై కూడా మణిరత్నం స్పెషల్ గా ఫోకస్ చేశారు. తెలుగులో ఈ సినిమా హిట్ అయితే.. పాన్ ఇండియా రేంజ్ లో వర్కైట్ అయినట్టే.. అందుకే హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు మేకర్స్, నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈవెంట్ జరుగనుంది. తెలుగు ఈవెంట్‌కు ఎవరెవరు ముఖ్యఅతిథులుగా వస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇక ఈసినిమాలో తమిళ తారలు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, పార్దీబన్, అరవింద్ స్వామి, త్రిష లతో పాటు బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, లాంటి స్టార్స్ నటించారు. కాని టాలీవుడ్ నుంచి ఒక్క స్టార్ కూడా ఈ సినిమాలో నటించలేదు. ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.