బిగ్ బాస్ కు వెళ్ళి తప్పుచేశాను.. షానీ షాకింగ్ కామెంట్స్, అక్కడ జరిగేది ఇదే అంటూ...?

By Mahesh JujjuriFirst Published Sep 23, 2022, 9:35 AM IST
Highlights

బిగ్ బాస్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు స్పోర్డ్స్ మెన్ కమ్ యాక్టర్ షానీ. వచ్చి రావడంతోనే బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు షానీ.. బుద్ద తక్కువై బిగ్ బాస్ కు వెళ్ళానంటూ.. బాధపడ్డాడు. 

బిగ్ బాస్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు స్పోర్డ్స్ మెన్ కమ్ యాక్టర్ షానీ. వచ్చి రావడంతోనే బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు షానీ.. బుద్ద తక్కువై బిగ్ బాస్ కు వెళ్ళానంటూ.. బాధపడ్డాడు. 

బిగ్‌బాస్ ఆరో సీజన్‌ జోరుగా సాగుతోంది. ఎలాగు బిగ్ బాస్ నిర్ణయం వల్ల ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాసెకండ్ వీక్ లో మాత్రం డబుల్ఎలిమినేషన్ తప్పలేదు. అందులో బలైపోయిన మొదటి కంటెస్టెంట్ షాని. బయటకు వచ్చీ రాగానే షానీ బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో వారమే హౌస్ నుంచి బయటికి వచ్చేసిన షానీ, ఇంత తొందరగా బయటికి పంపించేస్తారని అనుకోలేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ తనకు అన్యాయం జరిగిందంటూ వాపోయాడు. 

బిగ్‌బాస్ గురించి ఆయన మాట్లాడుతూ..  రెండో సీజన్‌లోనే తనకి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని అయితే.. అప్పుడు తనకు ఇంట్రెస్ట్ లేక వెళ్లలేదన్నారు. తరువాత చూద్దాంలే అనుకున్నట్టు షానీ అన్నారు. ఇప్పుడు మళ్లీ ఛాన్స్ చాన్స్ తన దగ్గరకు వచ్చేసరికి ఈసారి కాదనలేక ఒప్పకున్నట్టు ఆయన వెల్లడించారు. కాని తనను ఇంత  త్వరగా బయటికి పంపిస్తారని ఊహించలేదన్నారు షానీ. ఈ విషయం తనను ఎంతో  బాధిస్తోందనీ చెప్పాడు. బిగ్‌బాస్‌తో అంత సులువు కాదు.. స్పోర్ట్స్ మేన్, కమ్ యాక్టర్ అయిన తనకు బిగ్ హౌస్‌లో వుండేందుకు అన్ని అర్హతలూ వున్నాయనీ, అయినా, ఎందుకు ఎలిమినేట్ చేశారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు షానీ. 

అంతే కాదు తాను బయటకు వచ్చిన తరువాత అసలు ఏం జరిగిఉంటుందా అని అంతా పరిశీలించానని..  ఓటింగ్ కూడా తనకు బాగానే వుందని.. అయినా సరే తనను బయటకు పంపించడం వెనుకు ఏం జరిగి ఉంటుందా అని అనుమానం కలుగుతోందన్నారు షానీ.అంతే కాదు ఇకపోతే, బిగ్‌బాస్ హౌస్ అనేది కనిపించేంత ఈజీ టాస్క్ కాదనీ, బయటకుకనిపించేంత హాయిగా లోపల ఉండదన్నారు. చాలా విషయాల్లో  అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవల్సి వుంటుందనీ షానీ చెప్పాడు.

ఇక బిగ్ బాస్ గురించి .. అక్కడ సౌకర్యాల గురించి కూడా ఆయన మాట్లాడినట్టుతెలుస్తోంది. 20 మంది వరకూ ఉన్న బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఐదు బాత్రూమ్‌లే వుంటాయనీ అలాగే, అందరికీ సరిపడా బెడ్స్ కూడా  లేవనీ అన్నింట్లోనూ అడ్జస్ట్ చేసుకుని ఇబ్బంది పడుతూ ఉండక తప్పదన్నాడు షాని. 

click me!