సూపర్‌స్టార్‌కి నో చెప్పిన ఐశ్వర్య రాయ్‌.. షాక్‌లో రజనీ ఫ్యాన్స్ ?

By Aithagoni Raju  |  First Published May 17, 2022, 3:29 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తదుపరి సినిమాని నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న విసయం తెలిసిందే. ఇందులో ఐశ్వర్య రాయ్‌ పేరు హీరోయిన్‌గా వినిపించింది. కానీ..


సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) నెక్ట్స్ `బీస్ట్` (Beast) ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `తలైవా 169` (Thalaiva 169) వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. దీన్ని సన్‌ పిక్చర్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటి వరకు ఐశ్వర్య రాయ్‌ హీరోయిన్‌గా నటించబోతుందనే వార్తలు వినిపించాయి. దర్శకుడు నెల్సన్‌ ఐశ్వర్య రాయ్ తో చర్చలు జరుపుతున్నారని, ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అనే టాక్‌ వచ్చింది. 

ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాయ్‌(Aishwarya Rai) ఈ ఆఫర్‌ని తిరస్కరించిందని టాక్‌. తాను ఈ సినిమా చేయలేనని చెప్పిందనే వార్తలు ఊపందుకున్నాయి. మరి ఆమె ఎందుకు నో చెప్పిందనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఐశ్వర్య నో చెప్పిందనే వార్త హాట్‌ టాపిక్‌ అవుతుంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఇటీవల థళపతి విజయ్‌తో `బీస్ట్` చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ షాపింగ్‌ మాల్‌ని టెర్రరిస్ట్ లు హైజాక్‌ చేసిన నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ఆ మాల్‌ని, అందులోని ప్రజలను హీరో ఎలా కాపాడాడనే కథతో ఈ చిత్రం రూపొందింది. 

Latest Videos

సినిమా ఏప్రిల్‌ 13న విడుదలైంది. మొదటి షో నుంచే డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఓ పెద్దస్టార్‌తో ఇలాంటి సినిమా చేయడమేంటనే విమర్శలు వచ్చాయి. కానీ తమిళనాట సినిమా బాగానే కలెక్షన్లు వసూలు చేసింది. విజయ్‌ కి భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న నేపథ్యంలో సినిమా బెటర్‌గానే కలెక్ట్ చేసింది. అయితే ఇతర భాషల్లో మాత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. నెక్ట్స్ డేనే `కేజీఎఫ్‌ 2` విడుదల ఉండటంతో ఈ సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందనే టాక్‌ వినిపించింది. 

అయితే ఈ సినిమా ఆశించిన రిజల్ట్ రాకపోవడంతో రజనీకాంత్‌తో నెల్సన్‌ సినిమా ఉంటుందా? అనే డౌట్స్ ప్రారంభమయ్యాయి. కానీ ఆ ప్రభావం ఏం లేదని తెలుస్తుంది. అనుకున్నట్టుగానే సినిమా ప్రారంభం కానుందట. అయితే ఐశ్వర్య రాయ్‌ నో చెప్పడానికి ఇదే కారణమా? లేదా ఇంకేదైనా ? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2010లో వచ్చిన `రోబో`లో రజనీకి జోడీగా ఐశ్వర్య నటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఐశ్వర్య రాయ్‌ ప్రస్తుతం కేన్స్ లో పాల్గొనేందుకు వెళ్తుంది. నేడు(మే 17) నుంచి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ప్రారంభం కాబోతుంది. ఇందులో ఆమె రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేయనున్నారు. ఆమె గత ఇరవై ఏళ్లుగా కేన్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఐశ్వర్య `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంలో నటిస్తుంది.

click me!