Prabas - Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కోసం....  సలార్ పేరిట అధికారిక ట్విట్టర్ హ్యాండిల్!

Published : May 17, 2022, 02:22 PM ISTUpdated : May 17, 2022, 02:37 PM IST
Prabas - Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కోసం....  సలార్ పేరిట అధికారిక ట్విట్టర్ హ్యాండిల్!

సారాంశం

సలార్ మూవీ పేరిట అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లాంచ్ చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ప్రకటన చేశారు. 

స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పై ఉండగానే సోషల్ మీడియా అకౌంట్స్ స్టార్ట్ చేయడం ఈ మధ్య ట్రెండ్. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి ట్విట్టర్ హ్యాండిల్స్ లక్షల మంది ఫాలోయర్స్ కలిగి ఉన్నారు. ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకు ఓ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ స్టార్ట్ చేస్తున్నారు. సదరు అకౌంట్ ద్వారా మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు. ఓ మూవీకి సంబంధించిన అభిమానులను చేరుకోవడం దీని ద్వారా సులభం అవుతుంది. 

తాజాగా ప్రభాస్ (Prabhas)లేటెస్ట్ మూవీ సలార్ మూవీ పేరిట ట్విట్టర్ హ్యాండిల్ (Salaar the saga) ఓపెన్ చేశారు. ఈ మేరకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ కి నిర్మాతలు తెలియజేశారు. ఇకపై సలార్ చిత్ర అప్డేట్స్ ఈ అధికారిక అకౌంట్ ద్వారా పంచుకోనున్నారు. కాగా ప్రభాస్ కి ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంట్ లేదు. ఆయనకు ఫ్యాన్ పేజీ మాత్రమే ఉంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ సిరీస్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇమేజ్ ఎవరెస్ట్ కి చేరింది. ఆయన రాకీ భాయ్ క్యారెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ లాంటి మాస్ హీరోని ఈ రేంజ్ లో చూపించనున్నాడో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ కలుగుతున్నాయి. 

బాహుబలి తర్వాత వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న ప్రభాస్ కి సలార్ (Salaar) పర్ఫెక్ట్ కం బ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ అభిమాని సలార్ అప్డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిన విషయం తెలిసిందే. 

కాగా సలార్ (Salaar Update)ఇప్పటి వరకు 30-35 శాతం పూర్తయిందట. 2023 సమ్మర్ కానుకగా మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. కాబట్టి సలార్ థియేటర్స్ లో దిగడానికి మరో ఏడాది సమయం ఎదురుచూడాల్సిందే. కెజిఎఫ్ నిర్మాతలైన హోమబుల్ ఫిలిమ్స్ సలార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే