
బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ రేపు రిలీజ్ అవుతోంది. సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరి వెంకటేష్, షెహనాజ్ గిల్, భూమిక, జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. అంతేకాదు తెలుగు మార్కెట్ కోసం, తెలుగు నేటివిటీ ని పాటల్లో చొప్పించటం, తెలుగు నటులపై ఫోకస్ పెట్టారు. ఈ కథకూ తెలుగుకి లింక్ ఏముంది అనే విషయం గురించి చూస్తే...
ఈ సినిమా తమిళ సినిమా ‘వీరం’ ఆధారంగా తెరకెక్కుతోంది. తెలుగులో పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన ‘కాటమరాయుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ సినిమాని మార్పులు,చేర్పులతో సల్మాన్ తో తెరకెక్కించారు. తెలుగులో నాజర్ చేసిన పాత్రను వెంకటేష్ చేసారు. అయితే అక్కడ హీరోయిన్ కు తండ్రి పాత్ర ఇక్కడ అన్నగా మారుతుంది.
నార్త్ లో ఓ గ్రామానికి భాయీ జాన్ అందరూ పిలుచుకునే సల్మాన్ ఖాన్ పెద్ద దిక్కు. ఊరి ప్రజలు, తన నలుగురు తమ్ముళ్లే అతని లోకం. అందుకోసం పెళ్లికి కూడా దూరంగా ఉంటాడు. అయితే ప్రేమించిన అమ్మాయిలతో తమ పెళ్లిళ్లు కావాలంటే ముందు అన్నను ఓ ఇంటి వాడిని చేయాలని తమ్ముళ్లు ఫ్లాన్ వేస్తారు. ఇందుకోసం వాళ్ల లాయర్ సాయం తీసుకుంటారు. ఆ ఊళ్లోకి వచ్చిన పూజ హెగ్డే అనే క్లాసిక్ డాన్సర్ తో సల్మాన్ ని కనెక్ట్ చేసేందుకు నానా తంటాలు పడుతుంటారు. అదే సమయంలో తనకు తెలీకుండానే పూజకు సల్మాన్ కనెక్ట్ అయిపోతాడు. అయితే ఒక దాడిలో సల్మాన్ హింస రూపం చూసి అతని నుంచి దూరంగా వెళ్లిపోతుంది.
దీంతో పూజ కోసం సల్మాన్ అండ్ బ్రదర్స్ ఆమె ఊరికి వెళ్లి అనూహ్య పరిణామాల మధ్య ఆమె ఇంట్లోనే తిష్ఠ వేస్తారు. ఆ ఊరు తెలంగాణాలో ఓ గ్రామం. ఆ కుటుంబానికి హింస అంటే నచ్చకపోవటంతో ఎలాగైనా వాళ్లను మెప్పించే యత్నం చేస్తుంటాడు. అదే సమయంలో అక్కడ ఓ వ్యక్తి(జగపతిబాబు) నుంచి పూజ కుటుంబానికి పొంచి ఉన్న ముప్పును తెలుసుకున్న సల్మాన్ ఆ కుటుంబానికి అండగా ఉంటూ వస్తాడు. పూజ అన్నయ్య గా వెంకీ కనిపిస్తారు. చివరకు సల్మాన్ గురించి నిజం తెలుసుకున్న పూజ అన్న(వెంకటేష్) ఏం చేస్తాడు?జగపతిబాబు కు ఆ కుటుంబం పై పగ ఎందుకు? చివరకు ఏమౌతుంది అన్నదే కథ...
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని 'ఏంటమ్మ.. ఏంటమ్మ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా గ్లోబల్ స్టార్ చెర్రీ కూడా కనిపించడం ఆడియన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్‌తో ఓ నయా ట్రెండ్ సెట్ చేశారు కిసీకా భాయి కిసీకీ జాన్ టీమ్. ఇందులో రామ్ చరణ్ స్పెషల్ పాటకు స్టెప్పులు వేయడం హైలెట్గా నిలిచిందని అభిమానులు సంబరాలు చేసుకంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.