సలార్ టికెట్ ఫ్రీ గా ఇస్తానంటున్న హీరో నిఖిల్, మిర్చి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్...

Published : Dec 17, 2023, 09:36 AM IST
సలార్ టికెట్ ఫ్రీ గా ఇస్తానంటున్న హీరో నిఖిల్, మిర్చి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్...

సారాంశం

రిలీజ్ కు రెడీ అవుతుంది ప్రభాస్ సలార్ మూవీ. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఈసినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్ధ్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు.   

పాన్ ఇండియా సలార్ కోసం ఎదురు చూస్తోంది. ప్రభాస్ ప్యాన్స్ తో పాటు.. కామన్ ఆడియన్స్ కూడా ఈమూవీకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈమూవీ నుంచి స‌లార్ పార్ట్ 1 సీజ్ ఫైర్  ఈనెలలో రిలీజ్ కాబోతోంది.  కేజీఎఫ్‌ సినిమాల దర్శకుడు  ప్రశాంత్‌ నీల్‌  డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 22న  భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈమూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు టీమ్. ప్రమోషన్లు చేయకపోయినా.. మూవీపై అంచనాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. 

అంతే కాదు రీసెంట్ సలార్ మూవీ ఫస్ట్ టికెట్ ను రాజమౌళి అందుకున్నారు. ఇక ఈమూవీలో మల‌యాళ స్టార్ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడా చూద్దామా అని ప్ర‌భాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శుక్ర‌వారం కర్ణాటకలో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే రిలీజ్ కు ఇంకా 5 రోజులే  ఉండగా..  ఇంకా బుకింగ్స్  ఓపెన్ అవ్వకపోవడం ఆశ్చర్యం. 

సలార్ .. సినిమా బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలా ఓపెన్ అయితే అలా బుక్ చేయడం కోసం కాచుకుని కూర్చున్నారు. ఈక్రమంలో ఫస్ట్ డే టికెట్స్ దొరకు  ఈ అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్ప‌టినుంచే ఎగబడుతున్నారు. దీంతో ఫస్ట్ డే టికెట్స్ దొరుకుతాయా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ క్ర‌మంలోనే వారికి ఒక సాలిడ్ గుడ్ న్యూస్ అందించాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.

ప్రభాస్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో డిసెంబర్ 21న అర్ధరాత్రి 1 గంట‌ల‌కు సలార్ షో పడుతుందని, ఈ షోకి 100 మంది ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి ఫ్రీగా టికెట్స్ ఇస్తానని, వారితో కలిసి సినిమా చూస్తానని నిఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించాడు. ప‌దేళ్ల క్రితం ఇదే థియేట‌ర్‌లో మిర్చి సినిమా రాత్రి ఒంటిగంట షో చూశాను, ఇప్పుడు సలార్ సినిమాతో హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది.. అంటూ రాసుకోచ్చాడు నిఖిల్. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ ఫ్రీ టికెట్స్ ఎలా తీస‌కోవాలి అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నిఖిల్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌