టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న హీరో అర్జున్ కూతురు, యంగ్ హీరో జతగా ఐశ్వర్య

Published : May 18, 2022, 12:47 PM IST
టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న హీరో అర్జున్ కూతురు, యంగ్ హీరో జతగా ఐశ్వర్య

సారాంశం

తమిళ స్టార్ హీరో అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్థం అవుతుంది. ఆల్ రెడీ తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య అర్జున్ ఇప్పుడు టాలీవుడ్ ను టార్గెట్ చేసింది.   

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ సీనియర్ హీరోలు  కమలహాసన్ .. శరత్ కుమార్ కూతుర్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారు తమిళ్ తె పాటు తెలుగులోను ఫేమస్ అయ్యారు. ఇక మరో కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా తమిళ్ లో  కథానాయికగా పరిచయమైంది. ఇక ఇప్పుడు ఆమె కూడా టాలీవుడ్ పై కన్నేసింది. ఇక్కడ కూడా జెండా పాతటానికి రెడీ అయ్యింది. 

ఐశ్వర్య అర్జున్ తమిళ .. కన్నడ భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసింది. లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఇక వరుస సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు.కానీ ఆ తరువాత ఆమె తమిళంలోగానీ .. కన్నడలో గాని మళ్లీ తెరపై కనిపించలేదు. కన్నడలో తన సొంత బ్యానర్లో .. సొంత డైరెక్షన్లో ఐశ్వర్యను పరిచయం చేసిన అర్జున్, తెలుగులోను అదే తరహాలో ఆమెను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. 

ఇక ఐశ్వర్య ఎంట్రీకి సంబంధించి ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని సమాచారం. అర్జున్ కి స్టోరీ సెలక్షన్ స్క్రీప్ ప్లే పై మంచి పట్టు ఉంది. అదే విధంగా డైరెక్టర్ గా.. ప్రొడ్యూసర్ గా కూడా మంచి  అనుభవం ఉంది. ఈ ఎక్స్ పీరియన్స్ తోనే పక్కా ప్రణాళికతో ఐశ్వర్య ఎంట్రీ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు కథకు తగ్గట్టుగా హీరోను కూడా సెలక్ట్ చేసుకున్నాడట అర్జున్. 

అర్జున్ తన కథకి తగిన హీరోగా విష్వక్సేన్ ను ఎంచుకున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం.  రీసెంట్ గా విష్వక్ 'అశోకవనంలో అర్జున కల్యాణం తో సక్సెస్ ను అందుకున్నాడు. మరి ఈ సినిమా కన్ ఫార్మ్ అయినతే.. ఐశ్వర్యకు టాలీవుడ్ లో ఎలాంటి వెల్కం లభిస్తుందోచూడాలి. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?